నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి రవికుమార్ అన్నారు.గురువారం గట్టుప్పల మండల కేంద్రంలో 11 యూనిట్ల గొర్రెలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటుందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వంప్రవేశపెట్టినసంక్షేమ పథకాలనుపేద ప్రజలందరూసద్వినియోగం చేసుకోవాలనిఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, వెటర్నరీ డాక్టర్ బాలకృష్ణ, ఎంపీటీసీ గొరిగే సత్తయ్య, గట్టుపల సర్పంచ్ఇడెం రోజా, టిఆర్ఎస్ పార్టీ గట్టుపల మండల కన్వీనర్ఇడెం కైలాసం, కడెం సత్తయ్య, లబ్ధిదారులుతదితరులు పాల్గొన్నారు.