చేనేత పై జిఎస్టి రద్దు చేసే దాకా పల్లె పల్లెనా ధర్నాలు చేస్తాం కేంద్రం మెడలు వంచుతాం చేనేతలకు అండగా ఉంటాం : చేనేత మహాధర్నాలో ఎమ్మెల్సీ రమణ
నేటి ధాత్రి,దుబ్బాక:
చేనేత వస్త్ర రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన 12 శాతం జీఎస్టీ ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ డిమాండ్ చేశారు.జిఎస్టి పెంపునకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాటానికి చేనేతలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగంపై 12 శాతం జీఎస్టీ విధింపును నిరసిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నిర్వహించిన చేనేత మహాధర్నాలో ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొని మాట్లాడారు.స్వాతంత్ర పోరాటంలో చరఖాను ఆయుధంగా చేసుకుని మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్రం సాధించారని తెలిపారు.అంతటి ప్రాధాన్యం కలిగిన చేనేత వస్త్ర రంగంపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 5 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీని విధించడాన్ని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు.నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి చేనేత రంగానికి చెందిన 6 సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో
చేనేతల ఆత్మహత్యలు ఉండేవని నేడు సీఎం కేసీఆర్ కృషితో చేనేతలకు చేతినిండా పని కల్పిస్తున్న ఘనత కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.వస్త్ర రంగంపై జిఎస్టి పెంపును నిరసిస్తూ రాష్ట్ర మంత్రులు కేటీఆర్,హరీష్ రావు లు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు.డిసెంబర్ 31లోగా జిఎస్టి ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జనవరి1 నుండి పల్లె పల్లెనా చేనేతలతో కలిసి కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించారు.త్వరలో నిర్వహించబోయే హ్యాండ్లూమ్ మార్చ్ కు దుబ్బాక నుండే తొలి అడుగు పడనుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, రాజమౌళి తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూర మల్లేశం,పద్మశాలి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీధర్,పద్మశాలి సంఘం సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కాముని రాజేశం,జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, నందాల శ్రీజ శ్రీకాంత్,లోంక రాజవ్వ లచ్చయ్య,దుబ్బాక పట్టణ పద్మశాలి,నీలకంఠ సంఘాల అధ్యక్షులు బింగి రవి,మర్గల సత్యానందం,మున్సిపల్ కౌన్సిలర్లు, పిఎసిఎస్ చైర్మన్ షేర్ల కైలాస్,దుబ్బాక చేనేత కార్మికులు,టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.