`లిక్కర్ కేసు బిజేపి డ్రామా?
`బిజేపికి బిఆర్‌ఎస్ అంటే భయం పట్టుకున్నది?
` కేంద్రాన్ని ఎదిరించే శక్తి ఒక్క బిఆర్‌ఎస్ కే ఉంది?
`కవిత లాంటి డైనమిక్ మహిళా లీడర్ ఏ రాష్ట్రంలో లేదు?
`బిజేపి పార్టీలో ఒక్కరు కూడా లేరు?
https://netidhatri.com/integrity-thy-name-kavitha/
`కవిత పవర్‌ఫుల్ లీడర్… కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంది?
`అందుకే బిజేపి భయపడుతోంది?
`కేసులతో బెదిరించాలని చూస్తోంది!
`అసెంబ్లీలో తీర్మానం చేసిన పాలసీని స్కామ్ అనొచ్చా?
`మంత్రి మండలి స్కామ్ లపై సంతకాలు చేస్తుందా?
`పాలసీ అమలుకాకముందే స్కామ్ అని ఎలా అంటారు?
`ఢల్లీి సర్కారు మద్యం పాలసీని ఉపసంహరించుకున్నది కూడా!
` ప్రభుత్వం పాలసీ ఉపసంహరించుకుంటే తప్పు చేసినట్లేనా?
`కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల ఉపసంహరణ జరిగింది?
`కేంద్రం తప్పు చేశామని ఒప్పుకున్నట్లేనా?
`బిజేపియేతర ప్రభుత్వాలపై బిజేపి కక్ష?
`బిజేపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వమే మద్యం అమ్ముతోందా?
`అసలు ప్రభుత్వమే నేరుగాఆ మద్యం అమ్మకాల షాపుల నిర్వహణ తప్పు?
` కేంద్రం దేశమంతటా మద్య నిషేదం అమలు చేయొచ్చు కదా?
`లిక్కర్ స్కీమే లేదు…స్కామ్ ఎక్కడిది?
`ఢల్లీి ప్రభుత్వం ఎప్పుడో ఉప సంహరించుకున్నది?
`లిక్కర్ పాలసీ ప్రభుత్వాల నిర్ణయం!
`ఢల్లీిలో వున్న షాపులే 800 పైచిలుకు?
`గతంలో సగం ప్రభుత్వం నిర్వహించేది?
`సగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వుండేవి?
`కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే తప్పులేదా?
`మిగతా 400 షాపులు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం స్కామౌతుందా?
` ఒక్క ఢల్లీిలో నడిచే షాపుల ఆదాయం ఎన్నికలను ప్రభావితం చేసేంత శక్తి వుంటుందా?
`అంతా ఆదాని కోసమే….ఆదాని సమస్య పక్కదారి పట్టించడం కోసమే బిజేపి కుట్ర?
`వేల కోట్ల స్కామ్ చేసిన వారికి ప్రోత్సాహకాలా?
`ఢల్లీిి లిక్కర్ పాలసీలో గుజరాత్ వాళ్లుంటే బిజేపి కక్ష కట్టేదా?
`ఢల్లీి ప్రభుత్వం చేసిన పాలసీలో కవితకు ఎలా సంబంధం వుంటుంది?
`ప్రభుత్వ విధానాలు ఎక్కడైనా చర్చ లేకుండా జరుగుతాయా?
` ప్రతి వస్తువును పిరం చేసినోళ్లకు,ఢల్లీి మద్యం పిరమైందా?
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు, జిత్తులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కాని వేదింపులు సరికాదు. అందులోనూ రాజకీయ వేధింపులు అన్నవి ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా కేసులు నమోదు చేశారు. కాని అందులో తేలినవి కేవలం పదుల సంఖ్యలో మాత్రమే వున్నాయి. అంటే మిగతా కేసులన్నీ రాజకీయ క్షక్ష సాధింపు చర్యలకు పురిగొల్పినవే అన్న స్పష్టమౌతోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్ధ వుంది. దానికి అనుగుణంగా రాజకీయాలు చేయాలి. అధికారంలోకి రావాలి. అందుకు ప్రజల అభిమానం చూరగొనాలి. అంతే కాని కేంద్రంలో అధికారంలో వున్నామని, రాష్ట్రాల రాజకీయాలను కలుషితం చేస్తాం…. ఆ ప్రభుత్వాలను కూలుస్తాం…దొడ్డి దారిన మేం అధికారంలోకి వస్తాం అనే బిజేపి కుట్ర సరైంది కాదు. రాజకీయ పరిణతికి నష్టం జరగొద్దు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టొదు. అసత్యాలు, అర్ధసత్యాలు, విపీరత ప్రచారాల పేరుతో ప్రజల మనోభావాలతో ఆడుకునే రాజకీయాలు అసలే చేయొద్దు. ఇప్పుడు కేంద్రం చేస్తున్నది ఇదే అన్నది దేశంలోని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తెలుసు. అంతే కాదు దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల మీద ఈడి కేసులు నమోదు చేయడం, వారు బిజేపిలో చేరగానే ఆ కేసులను అటకెక్కించడం ఆనవాయితీగా మార్చుకున్నది బిజేపి. తెలంగాణలో కూడా అనేక మంది బిఆర్‌ఎస్ నాయకుల మీద కూడా ఈడీ కేసులు పెట్టడం చూసిందే… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు కూడా అదే కోవలోకే చెందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం అంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య బిజేపిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అంతే కాకుండా లిక్కర్ స్కామ్ అన్న పదమే తప్పని, స్కీము లేదు..స్కామ్‌కు అవకాశమేలేదు…ముడుపుల ముచ్చటే లేదంటూ, ఇందంతా బిజేపి రాజకీయ కుట్ర తప్ప మరేం లేదంటున్న రాజయ్య, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిని ఆయన మాటల్లోనే…
కల్వకుంట్ల కవిత. ఆమేమీ సామాన్యమైన నాయకురాలు కాదు.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన నాయకురాలు. అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ, ఆ జీవితాన్ని వదులకొని వచ్చి, తెలంగాణ కోసం కొట్లాడిన నాయకురాలు. ఆమె తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. ఆమె పదవులు ఆశించి రాలేదు. కేవలం తెలంగాణ సాధనలో భాగాస్వామ్యం కావాలన్న ఆలోచనతో మాత్రమే వచ్చారు. అలా తెలంగాణ వచ్చి, ఉద్యమంలో పాల్గొన్నవారు బిజేపిలోగాని, కాంగ్రెస్‌లోగాని అలాంటి వారు ఒక్కరైనా వున్నారా? అసలు బిజేపిలో ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ఎమ్మెల్యేలు, ఎంపిలే లేరు. కేవలం ఆనాటి యూపిఏ 2 ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసిన తర్వాతనే బిజేపిలో కొద్దిగా కదలిక వచ్చింది. తెలంగా ప్రకటన వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించగానే, తెలంగాణకోసం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేశాం… కాని ఆనాటి బిజేపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు. ఈనాడు రాజకీయాల కోసం తెలంగాణ సాధన కోసం కొట్లాడిన వారిని రాజకీయంగా వేధించడం అన్నది సరైంది కాదు. కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన సమయంలోనే జాగృతి అనే స్వచ్ఛంద సంస్ధ ఏర్పాటు చేసింది. దాని ద్వారా తెలంగాణలోని అనేక గ్రామాల్లో యువతకు వృత్తినైపుణ్య శిక్షణలు ఇప్పించి, వారి భవిష్యత్తుకు ఒక దారి చూపింది. ఐటి రంగంలో ఉద్యోగార్ధులకు అవసరమైన శిక్షణలు ఇప్పించింది. మరో వైపు బతుకమ్మ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మరో లెవల్‌కు తీసుకుపోయింది. సాంస్కృతిక పోరాటాన్ని పూలతో బతుకమ్మ రూపంలో సంస్కృతిని పునరుజ్జీవం కోసం పాటుపడిరది. అంతే కాదు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగినన్ని వంటావార్పు కార్యక్రమాలు మరే నాయకుడి ద్వారా జరగలేదు. ఎక్కువగా వాంటా వార్పు కార్యక్రమాలు ఆమె చేతుల మీదుగానే జరగడం విశేషం. ఇలా మహిళలను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా కవితకే దక్కింది. అలాంటి కవిత మీద లిక్కర్ కేసలన్న భూచీ చూపి, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం అన్నది సరైంది కాదు. ఆమె రాజకీయ జీవితానికి ఇబ్బందులకు గురి చేయడాన్ని తెలంగాణ సమాజం హర్షించదు. ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న నాయకురాలు. కవిత లాంటి డైనమిక్ నాయకురాలు దేశంలో ఎక్కడా లేరు. అంతే కాదు బిజేపిలో అలాంటి అలాంటి నాయకురాలు ఒక్కరు కూడ లేదు. దేశ రాజకీయాల మీద పట్టున్న నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణాలో ప్రగతి శీల పాత్ర పోషిస్తున్నారు. దేశంలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో పాస్ అయి ఇప్పటికీ సుమారు 27 ఏడేళ్లు పూర్తవుతోంది. కాని ఇప్పటి వరకు దేశంలో ఏ మహిళా నాయకురాలు ఈ విషయం గురించి మాట్లాడిరది లేదు. కేవలం ఒక్క కవిత మాత్రమే మాట్లాడుతూ వస్తోంది. ఆమె ఎంపిగా వున్న సమయంలో అనేక సార్లు ప్రస్తావించింది. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది. మహిళాభ్యుదయానికి,చైతన్యానికి కవిత అంకితభావం నిదర్శనం. ఒకనాడు తెలంగాణ కోసం, ఇప్పుడు మహిళా బిల్లు కోసం కవిత చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించాల్సిన సమయంలో కేసులు, ఈడీలు, సమన్లు అంటూ సమస్యను పక్కదారి పట్టించి, అసలు విషయం ప్రజల్లోకి పోకుండా బిజేపి అడ్డుకోవడం మహిళా సమాజాన్ని అవమాన పర్చడమే, చిన్న చూపు చూడడమే..వారికి అన్యాయం చేయడమే…మహిళల వాయిస్ లేకుండా చేయడమే? అవుతుంది.
కొన్ని విషయాలు లోతుగా విశ్లేషించుకోవాలి.
లిక్కర్ పాలసీలపై రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం సహజం. అందులో డిల్లీ ఆప్ సర్కారు ఒక నిర్ణయం తీసుకున్నది. అది తప్పో, ఒప్పో ఆ రాష్ట్రానికి సంబంధించింది. అంతే కాని దానిని ఎక్కడికో ముడిపెట్టి, ఎవరెవరినో జత చేసి, బిజపిని ఎండగుడుతున్న బిఆర్‌ఎస్‌ను ఎలా దెబ్బతీయాలని చూడడమే ఇందులో అసలు రహస్యం. ఇంతకన్నా ఏమీ లేదు. అంతా బిజేపి ఆడుతున్న డ్రామా… అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి? సహజంగా స్కాములు ఎలా జరుగుతాయన్నది అందరికీ తెలుసు. ప్రభుత్వం ప్రవేశ పెట్టన ఏదైనా పధకంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేస్తే స్కాం అవుతుంది. లిక్కర్ విషయంలో దానిలో దాపరికం అంటూ ఏమీ వుండదు. ఒక వేళ నకిలీ మద్యం సరఫరా చేస్తే నేరమౌతుంది. స్కాం అవుతుంది. అంతే కాని అసలు ఒక ప్రభుత్వం ప్రకటించిన పాలసీనలో వ్యాపారలు హక్కులు ఎలా స్కాం అవుతుందో బిజేపి నేతలే చెప్పాలి. ముడుపులు తీసుకుంటే స్కామ్ అవుతుంది? మరి అలాంటి ఆధారాలు ఎక్కడా లేవు. ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వచ్చాక కొన్ని కొత్త పాలసీలు తీసుకోవడం, పాత పాలసీలను పక్కన పెట్టడం సహజంగా జరిగిదే…అలాగే డిల్లీ ప్రభుత్వం కూడా గతంలో వున్న మద్యం పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. డిల్లీ లో సుమారు 800పైగా మద్యం షాపులు వుంటాయి. వాటిలో సగం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే, మరో సగం ప్రైవేటు వ్యాపారులు నిర్వహిస్తుంటారు. దానిలో ఆప్ ప్రభుత్వం మార్పు తీసుకొచ్చి, మొత్తం ప్రైవేటు వ్యాపారులకు ఆ డీలర్ షిఫ్‌లు అందించే పాలసీకి శ్రీకారం చుట్టింది. అందుకోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సుధీర్ఘమైన చర్యలు జరిపింది. అందుకోసం అధికారుల చేత ఒక కమిటీ వేసింది. ఆ అధికారుల కమిటీ నివేదిక మీద మరో ముగ్గురు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. అందులో కొన్ని సవరణలు చేసింది. ఆ నివేదికపై కూడా అక్కడి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సూచించిన సరవణలు కూడా పొందుపర్చి, అప్పుడు డిల్లీ శాసన సభ ఆమోంచింది. ఒక్కొ జోన్‌లో కేవలం 27 షాపులకే అనుమతులు అనే దానికి కూడా అంగీకారం తెలిపారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.9500 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఆప్ ప్రభుత్వం అంచానా వేసింది. 2021 జాన్‌లో క్యాబినేట్ కూడా ఆమోదముద్ర వేసింది. అంతే కాదు షాపుల నిర్వహణ అన్నది డిల్లీ డెవలప్ మెంటు అధారిటీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందన్న నిబందన కూడా చేర్చారు. దాంతో 2021 నవంబర్ 17 కాకపోతే దీన్ని అక్కడి ప్రతిపక్షాలు రాజకీయం చేయడంతో ఆప్ సర్కారు ఆ పాలసీని కూడా రద్దు చేశారు. ఇదంతా 2021 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన. ఆదానికి చెందిన కంపనీలు బ్యాంకులకు రుణాలు చెల్లించే పరిస్ధితుల్లో లేకపోతే వాటిని మాఫీ చేయడం తప్పుకానప్పుడు, ఆప్ సర్కార్ అమ్మకాలు లేని కారణంగా డీలర్లకు రూ.144 కోట్ల ఫీజు మాఫీ చేసిందనేది స్కామ్ అవుతుందా? దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు కరోనా సమయంలో రూ.10లక్షల కోట్ల బకాయిలు చెల్లించలేని కారణంగా వారికి కూడా రుణాలు మాఫీ చేసింది బిజేపి. కేంద్ర ప్రభుత్వం…ఇది తప్పుకాదా? సామాన్యులకు ఇచ్చే రేషన్ సరులకు ఉచితాలౌతాయి? అందరూ వంటకు వాడుకునే సిలెండర్ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. విమానాల ఇంధన ధరలు తగ్గుతాయి…పెట్రోల్ డీజెల్ రేట్లు పెరుగుతాయి? వీటిని స్కామ్‌లని ఎందుకు అనకూడదు? ఇలాంటి ప్రశ్నలు బిజేపి మీద ఎన్నో వున్నాయి. అన్నింటి గురించి బిజేపి పెద్దలు పనిపాట లేని ముచ్చట్లు బాగానే చెబుతారు? కాని ఆదాని గురించి వచ్చే సరికి ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడు…దేశంలో ఏ ఒక్కరికైనా రెండుకు మించి ప్రైవేటు ఎయిర్‌పోర్టులు వుండరాదు? ఇది చట్టం చెప్పే మాట… మరి ఆదానికి ఐదారు ఎయిర్ పోర్టులు ఇవ్వడం స్కామ్ కాదా? ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మకాలకు పెట్టడం స్కామ్‌ల కిందకు రాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అమ్మకాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయదని సంస్ధలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినప్పుడు, ఆప్ సర్కారు లిక్కర్ వ్యాపారం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మాణం చేయడం ఎలా స్కామ్ అవుతుంది? ఇంత చిల్లర రాజీకీయాలుంటాయా? అయితే ఆప్ సర్కార్ ఆ పాలసీని రద్దు చేసి, తన చిత్తశుద్దిని నిరూపించుకున్నది. స్కామ్ జరక్కపోతే ఎందుకు వెనక్కి తీసుకుంటున్నట్లు అని మళ్లీ ప్రశ్నిస్తున్న బిజేపి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు. మొసలి కన్నీరు కార్చారు? అందులో స్కామ్ లేదా? అన్న ప్రశ్నకు ఇంత వరకు బిజేపి ఎందుకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతోంది. దేశంలో ఇక బిజేపి పని అయిపోయింది. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలంటే కుయుక్తులు తప్ప, ప్రజల మనసుల్లో బిజేపికి చోటు లేదు. బిఆర్‌ఎస్‌ను చూసి బిజేపి భయపడుతోంది. పైగా ప్రతిపక్షాలు పుంజుకోవడం చూసి జడుసుకుంటోంది. ఎలాగైనా ప్రతిపక్షాలను వీక్ చేసి, ప్రజల దృష్టి మళ్లించి, కుటిల రాజకీయాలు చేయాలని బిజేపి చూస్తోంది. కాని ప్రజలు అంత అమాయకులు కాదు….సరైన సమయంలో బిజేపికి తగిన బుద్ది చెబుతారు..