`పాలకుల జాతకం కూడా కలిసి వస్తే ప్రతి రోజూ పండగ వాతావరణం.
`ఎమ్మెల్సీ దండె విఠల్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు.
` తొమ్మిదేళ్ల క్రితం వరకూ కరువు తాండవం
` తెలంగాణ సిద్దించడంతోనే తొలగిన కష్టం.
` తెలంగాణ వచ్చిన తొలి ఏడాది నుంచే రైతు గోసకు చరమగీతం.
` చెరువుల బాగుతో మొదలైన సంబరం.
` చెరువులు నింపడంతో నీటి తాండవం.
`కాళేశ్వరంతో మొదలైన అసలు సిసలు సాగు విప్లవం.
` ఇప్పుడు సిరుల సింగారం.
`నాడు చూద్దామన్నా చుక్క లేదు
`ఎటు చూసినా ఎడారిని తలపించిన తెలంగాణం.
` ఇప్పుడు కోటిన్నర ఎకరాల సాగు మాగాణం.
` నేడు ఎక్కడ చూసినా నీటి పరవళ్ళు ఆగింది లేదు.
`నిన్న చెమట చుక్కలతో వ్యవసాయం…
` నేడు కళ్ల నిండా ఆనందం.
`పాలకుల నిర్లక్ష్యం నాడు
`మనసున్న పాలకుడు నేడు.
`తెలంగాణ మురుస్తున్న వేళ ఇంటింటా సంబురం.
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణ వచ్చి అప్పుడే దశాబ్ధ కాలామౌతుందా? అనిపిస్తోంది. ఎందుకంటే సంతోషం పండగలాంటిది. అది ఆనందాన్ని నింపుతుంది. తెలంగాణ ఏర్పాటు అన్నది ప్రజలకు వేడుక. ఆ వేడుక వస్తూనే కొండంత ఆనందాన్ని తెచ్చింది. అంతకంటే గొప్ప నాయకుడిని తెలంగాణ ప్రజలకు అందించింది. ఆ నాయకుడే కేసిఆర్. ప్రతి యుగంలో ఒక పుణ్యపురుషుడు పుడతాడంటారు. అలాగే తెలంగాణ కోసం, తెలంగాణ విముక్తికోసం ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మ నిజంగానే చరితార్ధకమైందని చెప్పాలి. తెలంగాణ కోసం ఎంతో మంది శ్రమపడ్డారు. తెలంగాణ తేవాలని అనుకున్నారు. అయితే అనుకోవడం వేరు. కష్టపడడం వేరు. పట్టుదలతో సాధించడం వేరు. ఇవన్నీ మాత్రం ఒక్క కేసిఆర్ మాత్రమే త్రికరణ శుద్దిగా ఆచరించాడు. అనుసరించాడు. అందుకే మకు తెలంగాణను సాధించాడు. మనకు ప్రసాదించాడు. ఒక నాయకుడు పద్నాలుగేళ్ల సుధీర్ఘ ఉద్యమ రాజకీయ పోరాటం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో అంకితభావం వుండాలి. చిత్తశుద్ది కావాలి. ఎన్ని అవాంతరాలైనా ఎత్తుకున్న బాధ్యతను భుజం దించకూడదు. నమ్మకున్నవారికి అన్యాయం చేయకూడదు. అదే సరిగ్గా ముఖ్యమంత్రి కేసిఆర్ ఆనుసరించారు. అందుకే తెలంగాణ సాధించారు. ప్రజలకు బహుమానంగా అందించాడు. ఆ సమయంలో కేసిఆర్ కొంచెం పట్టు సడలినా నేడు ఈ పరిస్ధితి వుండేది కాదు. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒక పట్టుదల. ఆ పట్టుదలకు ప్రతిరూపం కేసిఆర్. అంటున్న ఎమ్మెల్సీ దండె విఠల్ , నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల కాలం క్షణంలా గడిచిపోయింది.. పదేళ్ల క్రితం ఒక రోజు యుగంలా గడిచేది. ఇది అతిశయోక్తి కాదు.
ఆనాటి క్షోభ గుర్తుకొస్తేనే గుండె జల్లు గుబేల్ మంటుంది. ప్రతి వ్యక్తి ఇబ్బంది పడ్డాడు. ప్రతి సమాజం దినదిన గండంగానే గడిపింది. ఉదయం లేవడంతోనే ఏదో ఒక వెలితి. అది కరంటు వుండదు. ఏ క్షణం వస్తుందో తెలియదు. ఎంత సమయం వుంటుందో తెలియదు. ఇక పల్లెల పరిస్ధితి మరీ అద్వాహ్నాం. ఇండ్లలో కరంటు వున్నప్పుడు ప్రజలు ఇంట్లో వుండేవారు కాదు. ఎందుకుంటే కూలీ నాలీ చేసుకుంటూ వుండేవారు. సాయంత్రం ప్రజలు ఇళ్లలోకి చేరుకునే సమయంలో కరంటు వుండేది కాదు. ఇదీ అప్పటి పరిస్ధితి. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కేసిఆర్ మొదలు పెట్టారో…కనీసం అప్పటి నుంచైనా కరంటు ఇస్తారని అనుకున్నాం. కాని కావాలని తెలంగాణ ప్రజలను నాటి సీమాంధ్ర పాలకులు మరింత ఇబ్బందులుకు గురిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో కరంటు నిరంతరంగా వుండేది. తెలంగాణలో కోతలే వుండేవి. కరంటు మాత్రం వుండేది కాదు. ఇది తెలిసిన తర్వాత ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగసింది. ఇక అసెంబ్లీలో ఓ సందర్భంలో హరీష్రావునుద్ధేశించి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటారో? చేసుకోండి?? అంటూ నాటి పాలకుల దుర్మార్గపు మాటలు తెలంగాణ మరింత రగిలిపోయేందుకు కారణమైంది. తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణ పల్లెలో ఎప్పుడు ఏ అలజడి వుంటుందో తెలిసేది కాదు. రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లను జన జీవన స్రవంతి లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి, 1989లో తెలంగాణ యువత జీవితాలతో ఆడుకున్నది. ఆ సమయంలో తెలంగాణ యువత పెద్దఎత్తున అటు వైపు అడుగులేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ప్రభుత్వాలు నిషేదాలు విధించడంతో ఎంతో మంది తెలంగాణలో అనేక ఇండ్లలో పుత్రశోకాలు మిగిలాయి. మళ్లీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్. రాజశేఖరరెడ్డి నక్సలైట్లతో చర్చల పేరుతో మళ్లీ తెలంగాణలో లేని అలజడి రేపాడు. అంటే తెలంగాణలో ఎప్పుడూ ప్రశాంతత లేకుండా చేస్తేనే సీమాంధ్ర అభివృద్దిపై చర్చ జరగకుండా చూసుకుండేవారు. ఇలా తెలంగాణను అల్లకల్లోం చేసి, ఆంధ్రాను అన్న పూర్ణగా తీర్చిదిద్దుకున్నారు. నీళ్లు తరలించుకెళ్లారు. తెలంగాణ ఎండబెట్టారు. తెలంగాణ భూములు పడావు పడేలా చేశారు. ఆంధ్రాలో కాలువలు, పొలాలకు నీళ్లు, ఆఖరుకు చేపల చెరువులు కూడా నింపుకున్నారు. తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. క్షోభకు గురి చేశారు. గోస పెట్టారు.
మన తెలంగాణను మనకు సాధించి పెట్టిన ముఖ్యమంత్రి కేసిఆర్ పదేళ్ల కాలంలో తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధిని చేసి చూపించారు.
తెలంగాణ వచ్చాక ఎలా వుంది? అంటే మాటల్లో చెప్పలేనంతగా అభివృద్ది చెందిందని టక్కున చెప్పేస్తారు. పదేళ్ల క్రితం తెలంగాణ వచ్చి వెళ్లి, మళ్లీ ఇప్పుడు చూసిన వారు ఆశ్చర్యపోకతప్పదు. ఎందుకంటే తెలంగాణ అంత వేగంగా అభివృద్ధి చెందింది. ప్రతి ఇంటికి నీరొచ్చింది..మిషన్ భగీరధతో సురక్షితమైన మంచినీరు అందుతోంది. ప్రతి అడుగుకు నీరుంది. తెలంగాణలో ఎండిన బీడంతా తడిసింది. నెర్రెలు పారిన నేలంతా పచ్చదనం పర్చుకున్నది. నేలంతా సాగౌతోంది. తెలంగాణ నేలంతా పచ్చగా సింగారించుకున్నది. తెలంగాణ బంగారమైంది. ఎటు చూసినా నీళ్లతో కళకళలాడుతోంది. పాడి పంటకు అసలైన నిర్వచనం తెలంగాణలో కనిపిపిస్తోంది. ఇదంతా కల గన్నామా? అసలు తెలంగాణ వస్తుందన్న ఆశలే లేని రోజుల నుంచి, తెలంగాణ సాధించి, బంగారు తెలంగాణను చూస్తున్నాం. ఇదంతా కేసిఆర్ వల్లనే సాధ్యమయ్యింది. కేసిఆర్ లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు. కేసిఆర్ పాలన లేకుంటే తెలంగాణ ఇలా వుండేదే కాదు. ఎందుకంటే యుగపురుషులు చేపట్టే ప్రతి కార్యానికి ప్రకృతి కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడిన గోసకు మరో కారణం కూడా వుంది. తెలంగాణ అంటేనే చిన్న చూపు వున్న నేతలు అదృష్టం కొద్ది ముఖ్యమంత్రులైనా చరిత్ర హీనులుగానే మిగిలిపోయారని చెప్పకప్పదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద తీవ్ర వివక్ష చూపించేవారు. అందుకే ఆయన పాలనుకు ప్రకృతి ఏనాడు సహకరించలేదు. ఆయన పాలించిన తొమ్మిదేళ్లలో ఏడేళ్లు కరువు. రెండేళ్లు భయంకరమైన కరువు. మొత్తంగా ఆయన పాలతనంతా కరువు మయం. కాని సీమాంద్రను వున్నదాంతా దోచిపెట్టాడు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపాడు. ఏ సీమాంధ్రను చూసి అన్న పూర్ణ అంటూ కీర్తించేవారో..అదే ప్రాంతంలో క్రాప్ హలీడే కూడా డిక్లేర్ చేసిన రోజులు ఒక్క చంద్రబాబు హాయాంలోనే జరిగింది. అంటే ఆ సమయంలో పచ్చని పొలాలతో అలరాలుతుండే సీమాంధ్రలోనే మంచినీళ్లకు కరువొచ్చిందంటే, తెలంగాణలో ఎంతటి దుర్భరమైన పరిస్ధితులు వుండేవో అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకునేవారు. అటు కరువు, ఇటు ఉపాధి లేక, పంటలు పండక, నాటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ అస్తవ్యస్ధమైంది.
కళ్లుండి చూడలేని, నోరండి మాట్లాడలేని, పదవులుండి పలుకుబడి లేని తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం నేతలంతా నిశ్చేష్ట్రులుగా, ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయేవారు.
వారికి పదవులుంటే చాలు ప్రజలు ఏం లేకున్నా ఫరవాలేదన్నంతగా రాజకీయం చేసేవారు. నిండు అసెంబ్లీలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వమని నాటి పాలకులు చెబుతుంటే, మౌనం దాల్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆనాడు మూగబోయిన నోర్లు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. సీమాంధ్రులను ప్రశ్నించలేని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయి. నాడు పాలన చేతగాని వాళ్లు, ఇప్పుడు పదవుల కోసం ఆరాపడుతున్నారు. పదేళ్లలో జరిగిన తెలంగాణ అభివృద్ధిని కూసి కొనియాడాల్సిందిపోయి, ఆనాడు చెప్పలేకపోయిన మాటలు ఇప్పుడు చెబుతున్నారు. కాని పుణ్యకాలం ఎప్పుడో దాటిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల రాజకీయాలకు ఎనాడో నూకలు చెల్లిపోయాయి.