
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ నరేష్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లోనాడు,నేడు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ లో ఆళ్లపల్లి మండలం తునికిబండల పాఠశాల విద్యార్థులు 5వ తరగతి పూర్తవక ముందే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలో సీటు దక్కించుకొని అక్కడికి వెళ్లి ఈ గిరిజన ఆణిముత్యాలు పట్టణ, నగరాల విద్యార్థులతో పోటీ పడడం వారికి విద్య నేర్పిన గురువులుగా మాకెంతో తృప్తిఅన్నారు. ఇస్లావత్ నరేష్ నాయక్ 2013వ సంవత్సరంలో మొదటి సారి వృత్తి రీత్యా తునికిబండల గ్రామానికి వచ్చినప్పుడు రోడ్డు సౌకర్యం లేదు, వర్షాకాలంలో జల్లేరు వాగు ని కూడా లెక్కచేయకుండా ఛాతి వరకు వచ్చిన దాటుకుంటూ వచ్చిన రోజులు లేకపోలేదు.2013 కంటే ముందు దాదాపు 5 సంవత్సరాలు ప్రభుత్వ ఉపాద్యాయుడు లేక విద్యార్థులు చదువుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది 2013 ఆగస్టులో తునికిబండల పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలో 10సంవత్సరాలు పూర్తిచేశారు. ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు పదుల సంఖ్యలో మంచి పై చదువులు చదువుతున్నారు. వారిని బట్టి ఇక్కడి ఉపాధ్యాయులుహర్షం వ్యక్తం చేశారు.తాటి లేవియా కు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ లో చోటు దక్కడం వల్ల పాఠశాల ఉపాధ్యాయురాలు మొల్కమ్ సమ్మక్క హర్శించారు.విద్యార్థి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.గ్రామస్తులు