రాజాపూర్ తహసిల్దార్ రాంబాయి
మహబూబ్ నగర్ జిల్లా:: నేటి ధాత్రి
నేడు 81 దరఖాస్తులు
ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మండలవాసులు సద్వినియోగం చేసుకోవాలని రాజాపూర్ తహసిల్దార్ రాంభాయి పిలుపునిచ్చారు.
శనివారం ఈ మేరకు రాజాపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 81 మంది కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ రాంబాయి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశాల మేరకు ఈనెల 26, 27 తేదీలతో పాటు, డిసెంబర్ 3 ,4 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ నాలుగు రోజులలో నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి బూతు స్థాయి అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఉంటారని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి యువతీ, యువకులు గరుడ ఆప్ లేదా ఫారం -6 ద్వారా ఓటరు గా నమోదు చేసుకోవాలని తెలిపారు.