సమరశీల పోరాటాలు ఏఐఎస్బి ద్వారానే సాధ్యం
ఏఐఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి
చేర్యాల : నేటిధాత్రి….
చేర్యాల మండలంలో ఏఐఎస్బి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సభ్యత్వా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని వారు అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి
పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ…
రాష్ట్రంలో ఏఐఎస్బి సభ్యత్వ నమోదు.మొదటి విడతగా 2 లక్షల సభ్యత్వాలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు విద్యారంగం బలహీనపడటం బాధాకరమని ప్రభుత్వం విద్య వ్యవస్థ పై చిన్న చూపు చూడడం తగదని హితవు పలికారు. రాష్ట్రంలో ఏఐఎస్బి ని బలమైన విద్యార్థి శక్తిగా తయారుచేసి సమరశీల పోరాటాలకు సిద్ధమవుతామని ప్రకటించారు యుద్ధ ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికలలో వారికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు విద్యార్థులందరూ ఏఐఎస్బి లో చేరి తమ హక్కులు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఐదువేల కోట్లను తక్షణమే విడుదల చేయాలని పూర్తిస్థాయి ఎంఈఓ లను నియమించాలని ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులు కల్పించాలని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలకు వందకోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనను చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు,నాయకులు బాలు, ఎర్రోళ్ల అఖిల్, సాయికిరణ్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు