శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ పై అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా ప్రతినిధి శాయంపేట ఏ కృష్ణమూర్తి, ఎస్సై దేవేందర్, ఎంపీఓ రంజిత్, ఏఆర్ఐ హుస్సేన్, బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులు అన్ని గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరైనారు. అవగాహన సమావేశం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అందుకు రాజకీయ పార్టీలకు సంబంధిత బ్యానర్లు, హోల్డింగులు పోస్టర్లు కటౌట్లు రోడ్డుపై కలవు ఇవి బుధవారం 12 గంటల లోపు తొలగించాలి. ప్రైవేట్ వ్యక్తుల ఇళ్ళ గోడలపై రాయబడిన రాతలు గురువారం 12 గంటల లోపు మలిపివేయాలని ఆ ఇంటి ఓనర్ల అనుమతి పత్రం సమర్పించాలని ఒకవేళ అనుమతి పత్రం ద్వారా అట్టి రాతలు కొనసాగిస్తే ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఖర్చులలో దాని విలువ కలపడం జరుగుతుందని తెలియజేశారు ఎవరు కూడా ఇతర పార్టీల మీద దూషించడం కల్పిత మాట్లాడడం విమర్శించడం వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి విమర్శించడం గాని చేయరాదు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.