ఎంపీ వద్దిరాజు ఇల్లందు పర్యటన

కేసీఆర్ గారు ప్రధాని అవుతారు,అందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి:ఎంపీ రవిచంద్ర

కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుంది:ఎంపీ రవిచంద్ర

కేసీఆర్ గారు తెలంగాణను నంబర్ 1రాష్ట్రంగా తీర్చిదిద్దారు:ఎంపీ రవిచంద్ర

ఇల్లందు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదింది:ఎంపీ రవిచంద్ర

ఇంఛార్జిగా పెత్తనం చేసేందుకు రాలే, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అందరిని సమన్వయం చేస్త:ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా మొట్టమొదటి సారి ఇల్లందు విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు అపూర్వ స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు

లోకసభ సభ్యులు కవిత, ఎమ్మెల్యే హరిప్రియల నాయకత్వంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దేశ ప్రధాని అవుతారని,అందుకు కావలసిన అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.కేసీఆర్ గారికి సుదీర్ఘ పాలనానుభవం,దక్షత,అన్ని అంశాలపై లోతైన అవగాహన, వక్తృత్వం, సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమితులయ్యాక సోమవారం మొట్టమొదటి ఇల్లందుకు విచ్చేశారు.ఈ సందర్భంగా ఆయనకు లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తదితరుల నాయకత్వంలో అపూర్వ స్వాగతం లభించింది.డప్పువాయిద్యాలు, లంబాడ,కోయ నృత్యాలు,కోలాటం, పటాకులు కాల్చుతూ రవిచంద్రకు ఘన స్వాగతం పలికారు, గజమాలతో సత్కరించారు.ఎంపీ వద్దిరాజు ఇల్లందులో మొదట అభన్నాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాక,యువతను,కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ 3కిలోమీటర్లు వడివడిగా నడిచారు.పోలీసుస్టేషన్ చేరుకున్నాక ప్రచారరథమెక్కి చౌఈ గులాబీ శ్రేణులు,ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.రానున్న ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.అటుతర్వాత ఆయన దేశ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి,పట్టు సాధిస్తారని,కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు.కాలం కలిసివస్తే కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారని రవిచంద్ర వివరించారు.అనితర సాధ్యం అనుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించిన కేసీఆర్ గారు గొప్ప నాయకులని, బంగారు తెలంగాణగా,దేశం మొత్తం మీద నంబర్ 1గా తీర్చిదిద్దారని కొనియాడారు.ఈ సింగరేణి గడ్డ తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ఊపిరులూదిందని,మలి దశ పోరాటంలో అగ్రభాగాన నిలిచిందన్నారు.ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన నాయకుడిని కేసీఆర్ గారు చేరదీసి జెడ్పీ ఛైర్మన్ పదవి కట్టబెడితే డబ్బు సంచులకు అమ్ముడుపోయాడని,వారి ఆటలు సాగనివ్వమని రవిచంద్ర స్పష్టం చేశారు.తానిక్కడకు పెత్తనం చేసేందుకు రాలేదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గులాబీ శ్రేణులను సమన్వయం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పంపితే వచ్చానన్నారు.రానున్న ఎన్నికల్లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియల అఖండ విజయం తథ్యమన్నారు.ఇందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు.ఎంపీ రవిచంద్ర ఆగమనం సందర్భంగా ఇల్లందు పట్టణంతో పాటు నియోజకవర్గమంతా గులాబీమయమైంది.గులాబీ తోరణాలు,జెండాలు,ఫ్లైక్సీలు, హోర్డింగులతో ఇల్లందు నూతన శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”, “జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి” అనే నినాదాలు హోరెత్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!