ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర” పురస్కారాలు
“నేటిధాత్రి” హనుమకొండ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్ రీజియన్ లోని వరంగల్-1 డిపో యందు అన్ని డిపోల యొక్క ఉత్తమ ఉద్యోగుల సేవలను గుర్తించి రీజినల్ త్రైమాసిక అవార్డు ప్రధాన ఉత్సవము *ప్రగతి చక్ర పురస్కారములు* అందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవనీయులు జే. శ్రీలత రీజినల్ మేనేజర్ వరంగల్, కృపాకర్ రెడ్డి డిప్యూటీ ఆర్.ఎం (ఓ) మాధవరావు డిప్యూటీ ఆర్ ఎం(ఎం) మరియు అన్ని డిపోల డిపో మేనేజర్లు పాల్గొని ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు.
వరంగల్-1 డిపోలో పి నిర్మల ఉత్తమ బస్ స్టేషన్ మేనేజర్‌గా మరియు శ్రీ ఏ.రాజేందర్, టి.జలంధర్ సింగ్, కే.శ్యామ్, ఎం.శ్రీను, కె వీరయ్య ఉత్తమ డ్రైవర్లుగా జి.సుధాకర్ ఉత్తమ కండక్టర్‌గా ఎస్.రమేష్ ఉత్తమ టీమ్ డ్రైవర్ గా టి.శంకరి, ఎం.డి అనీష్ ఉత్తమ మెకానిక్‌లుగా రీజినల్ మేనేజర్, డిప్యూటీ ఆర్ ఎం లు మరియు డిపో మేనేజర్ పి శ్రీనివాసరావు వరంగల్-1 డిపోకు చెందిన ఉత్తమ ఉద్యోగులను సన్మానం చేశారు.