`ములుగు సబ్ రిజిస్ట్రార్ విసిరిన ఛాలెంజ్ కు ఇవిగో సాక్ష్యాలు?
`సవాలు విసిరి మరీ రిజిస్ట్రేషన్ శాఖను చిక్కుల్లోకి నెట్టిన సబ్ రిజిస్ట్రార్!
`పరోక్షంగా శాఖకే సవాలు విసిరిన వైనం?
`పై అధికారుల చేతగాని తనాన్ని ఎద్దేవా చేసినంత ఉదంతం?
`తన అవినీతికి పట్టుకోలేకపోయారని ఎగతాళి చేసినంత పనిచేసిన సబ్ రిజిస్ట్రార్?
` అవినీతికి అడ్డాగా రిజిస్ట్రేషన్ కార్యాలయం మార్చి ప్రైవేటు వ్యక్తుల జోక్యం తేటతెల్లం?
` ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా? లేదా!
` ఇన్ని సాక్ష్యాలను మరుగున పడేసిన విచారణ అధికారులు కూడా దోషులే?
`పత్రికలన్నీ కథనాలు రాసినా స్పందన లేని అధికారులు ఇప్పుడేం చెబుతారు?
`ఎవరీ బిక్షపతి?
`అతనికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సంబంధం ఏమిటి?
`లాగిన్ ఐడి అతని చేతికెలా వచ్చింది?
`ప్రైవేటు వ్యక్తులకు లాగిన్ ఐడి ఇవ్వడం నేరం కాదా?
`సబ్ రిజిస్ట్రార్ ను ఇంత కాలం వెనకేసుకొచ్చిన వాళ్లది కూడా తప్పే?
`ఏళ్లకేళ్లు తిష్ట వేసుకొని సబ్ రిజిస్ట్రార్ చేసిన తప్పులకు రుజువులివి!
`తప్పులు చేసి, నేటిధాత్రి మీద నిందలేస్తే ఊరుకుంటామా?
`ఇంతకన్నా రుజువులేం కావాలి?
`ఇప్పటికైనా విచారణ మొదలుపెడతారా? మీనమేషాలే లెక్కిస్తారా!
`నేటిధాత్రి చేతిలో సబ్ రిజిస్ట్రార్ అక్రమాల చిట్టాలు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ములుగులో సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమాలకు నిరదర్శనం. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారని చెప్పడానికి సాక్ష్యం. అక్రమాలు చేసినట్లు కనిపిస్తున్న దృశ్యం…ప్రైవేటు వ్యక్తికి లాగిన్ ఐడి కూడా ఇచ్చినట్లు తేట తెల్లం…బైట పడిన వ్యక్తి నామదేయం…ఇప్పుడేం చెబుతారు? ప్రకటించినట్లే సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం నుంచి తప్పుకుంటారా? తప్పు జరిగిందని ఒప్పుకుంటారా? అయినా బుకాయించడానికి కొత్త దారులు వెత్తుక్కుంటారా? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారా? అంతా తూచ్ అంటారా? ఇవన్నీ కల్పితాలంటూ కొత్త రాగం అందుకుంటారా? జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాక కూడా బుకాయిస్తే సరిపోదు…తాను తప్పు చేయలేదంటే ఎవరూ ఒప్పుకోరు…? అతి విశ్వాసం అనర్దాలకు దారి తీస్తుంది. ఒక తప్పు వంద తప్పులను చేసేందుకు ఆస్కారమిస్తుంది. ఇంత కాలం ఏ అధికారులైతే సబ్ రిజిస్ట్రార్‌ను వెనకేసుకొచ్చారో…వాళ్లును కూడా ఒక్క మాటతో సబ్ రిజిస్ట్రార్ దోషులను చేసినట్లే లెక్క. ఎందుకంటే తాను ఎలాంటి తప్పు చేయలేదని పై స్ధాయి అధికారులకు కూడా తెలుసున్నంతగా గొప్పగా తనను తాను చిత్రీకరించుకున్నారు. అంటే పెద్దల ఆశీస్సులు తనకు మెండుగా వున్నాయని, తానేం తప్పులు చేసినా చూస్తూ ఊరుకున్నారని చెప్పకనే చెప్పినట్లైంది. పైగా తనపై వచ్చిన ఆరోపణలపై కూడా జరిగిన విచారణల్లో కూడా తప్పేం లేదని తేలినట్లు కూడా సబ్ రిజిస్ట్రార్ చెప్పుకున్నారు. అంటే విచారణ కోసం వచ్చిన అధికారులు కూడా పొరపాటు చేశారని చెప్పినట్లే లెక్క. ఒక వేళ విచారణ చేసిన అధికారులకు సబ్ రిజిస్ట్రార్ లాగిన్ ఐడి ప్రైవేటు వ్యక్తికి ఇచ్చినట్లు కనిపెట్టలేకపోయారా? బైటపట్డా ఆమెను వెనకేసుకొచ్చారా? ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చారా? అంటే విచారణ చేపట్టే అధికారులకు కూడా ఆమె ఇక్కడ ఇరికించేసినట్లే లెక్క. తాను చేసిన అక్రమాలన్నింటిలో పై స్ధాయి అధికారుల పాత్ర కూడా వుందని స్వయంగా సబ్ రిజిస్ట్రారే వెల్లడిరచినట్లైంది. ఓ వైపు సవాలు విరుసురుతూనే మరో వైపు ఎన్ని తప్పులు చేసినా వెకనేసుకొచ్చిన అధికారులకు కూడా ముప్పు తెచ్చేందుకు సబ్ రిజిస్ట్రార్ వెనకాడడం లేదన్నది కూడా తేలిపోయింది. తను తప్పించుకునేందుకు ముందే మార్గం సుమగమం చేసుకుంటూ, ప్రతి దాంట్లో పైస్ధాయి పెద్దలను ఇరికిస్తూ వచ్చారన్నది తేటతెల్లమైంది. ఇప్పుడు ఉన్నతాధికారులు ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.
ఇంతకీ బిక్షపతి ఎవరు?
ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాయలంలో ప్రభుత్వ ఉద్యోగా? ప్రైవేటు వ్యక్తా? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తిపేరు డాక్యుమెంట్లలోకి ఎలా చేరింది? బిక్షపతి ప్రైవేటు వ్యక్తి అయితే కార్యాలయంలో విధులెలా నిర్వర్తించారు? ఆయనను ఎవరు రిక్రూట్ చేసుకున్నారు? ఎలా విధులు అప్పగించారు? ప్రభుత్వమేమైనా కాంట్రాక్టు పద్దతిన తీసుకున్న ఉద్యోగా? అయినా రిజిస్రేషన్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగులకు అంత స్వేచ్ఛ వుంటుందా? లాగిన్ ఐడిని ఉపయోగించేంత శక్తి వుంటుందా? ఇదంతా సబ్ రిజిస్ట్రార్ కనుసన్నల్లో జరగుకుండా వుంటుందా? సబ్ రిజిస్ట్రార్‌కు తెలియకుండా లాగిన్ ఐడి తెలుస్తుందా? ఓపెన్ అవుతుందా? ఒక ప్రాంతానికి చెందిన భూమలైన స్ధిరాస్ధులు, ప్రభుత్వ ఆస్ధులు, స్థలాలు, ముఖ్యంగా అటవీ భూముల నిర్వహణ జరిగే ప్రాంతంలో బాధ్యతాయుతమైన సబ్ రిజిస్ట్రార్ ఎంత అంకితభావంతో వుండాలి. ఎంత కర్తవ్య దీక్షతో వుండాలి. అది వదిలేసిన కార్యాలయాన్ని ఎవరి చేతిలోనే పెట్టేసి, జరగాల్సిన అక్రమాలకు కేంద్రంగా మార్చేసి తానేమీ ఎరగను? తనేం తప్పు చేయలేదు? తప్పు చేస్తే ఇంత కాలం ఎలా వుంటాను? అంటూ కొత్త పల్లవి అందుకోవడమే కాదు…తన తప్పులు నిరూపిస్తే ఉద్యోగం మానుకుంటానని కూడా సబ్ రిజిస్ట్రార్ ప్రకటించారు…
ఒక మంచి పని చేయడానికి ఎంత దూరమైనా వెళ్లొచ్చు.
ఎంత సేవైనా చేయొచ్చు…ఇది ఎవ్వరూ కాదనలేరు. ఎంత దూరమెళ్లినా, ఎవరికీ అన్యాయం చేయకుండా వుంటేనే ఏ సేవకైనా అర్ధం పరమార్ధం వుంటుంది. దోసెడు దోచుకున్నట్లు ఆరోపణలు కంటి ముందుకనిపిస్తున్నా, పిడికెడు పెట్టి కొండంత ప్రచారం చేసుకుంటుంటే ప్రజలు గుర్తించలేరా? పెట్టే పిడికెడు కష్టపడి సంపాదించింది కాదు…పేదలను కష్టపెట్టి దోచుకున్నదాంట్లో నుంచి మెతుకులు విదిలిస్తే గమనించలేరా? పెట్టిన పిడికెడుకు పుట్టెడు ప్రచారం చేసుకుంటే సరిపోదు…దోచుకున్న దోసెడుకు కూడా సమాధానం చెపాల్సి వస్తుంది? పవిత్రమైన ఉద్యోగ నిర్వహణలో వుంటూ, ప్రజల భూములకు రక్షణగా నిలవాల్సిన కుర్చీలో కూర్చొని ఆ భూములకే ఎసరు పెడుతుంటే జనానికి తెలియకుండా పోతుందా? పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే కనిపించదా? జనం దగ్గర దోచుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ దాచుకున్నదేమీ లేదు? కర్తవ్యం గంగలో కలిపి, చెంచా నైవేద్యం చేతిలో పెట్టి నాకిస్తా..? అందిన కాడికి దోచేస్తా…భూములను చెరపట్టేవారికి అండగా వుంటా? అంటే జనం సహిస్తారా? తానేమీ తప్పు చేయలేదంటూనే తనపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏదో విచారణ చేపట్టి, క్లీన్ చీట్ ఇచ్చినట్లు చెప్పుకున్నా బాగుండేది?
కాని ఓ ఎవరో ఒక వ్యక్తి విచారణ చేసి, తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని సర్టిఫికెట్ ఇచ్చాడని చెప్పుకోవడంలోనే డొల్లతనం బైటపడిరది. పైగా కార్యక్రమాలలో ఎమ్మెల్యే సీతక్క చేసే సేవా కార్యాక్రమాలలో పాలు పంచుకుంటూ, ఆమెతోపాటు వెళ్లినంత మాత్రాన సబ్‌రిజిస్ట్రార్ చేసేది కూడా సేవే అని ఎవరూ అనుకోవడం లేదు. అంతే కాదు సీతక్కతో పాటు వెళ్లి, సేవ చేస్తున్నట్లు కనిపించడం కూడా పెద్దఎత్తున ప్రచారానికి వాడుకోవడం జరుగుతుంది. ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగులు వితరణల్లో పాల్గొన్నప్పటికీ బైటకు ప్రచారం చేసుకోవడం కనిపించదు. కాని సబ్ రిజిస్ట్రార్ చేసే గోరంత సాయానికి కొండంత ప్రచారం అన్నది అందరూ చెప్పుకునే మాటే…ఇక ఇటీవల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సాక్షియగా జరుగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటీ బైటకు వస్తుండడంతో దివంగత తన తండ్రిని ముందు పెట్టుకొని సానుభూతి ప్రయత్నం కూడా వదలుకోవడం లేదు. తన తండ్రిని నక్సలైట్లు చంపారని సబ్ రిజిస్ట్రారే చెప్పుకుంటుంటోంది? మరో వైపు తనపై మావోయిస్టు సానుభూతి పరురాలన్న ముద్ర వేయాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తోంది? ఒక ఉద్యోగి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా నేరమే…గతంలో ఎంతో మంది ఉద్యోగులను కూడా పోలీసు వ్యవస్ధ విచారణ చేసిన సందర్భాలు ములుగు ప్రాంతాల్లోనే కోకొల్లలు…! అసలు ఆ మాట నోటినుంచి వెలువడి ఉద్యోగులను కూడా విచారించకుండా పోలీసులు వదల్లేదు..ఇది చరిత్ర. అంతే కాదు తన తండ్రి కమ్యూనిస్టుగా చెప్పుకుంటూనే తన తండ్రిని నక్సలైట్లు చంపారని చెప్పడం నిందలో భాగమా? గొప్ప కోసమా? అలాంటప్పుడు తాను సానుభూతి కోసం చెప్పుకోవడంలో అర్ధమేమిటి? ఒక వ్యక్తి నక్సలైట్లకు వ్యతిరేకంగానో, లేక పోలీసులకు అనుకూలంగానో, పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నవారిని మాత్రమే నక్సలైట్లు చంపేవారని చెప్పుకునేవారు…మరి తన తండ్రి కమ్యూనిస్టు అని తెలిసినా తర్వాత నక్సలైట్లు చంపారంటే ఏదో బలమైన కారణం లేకుండానే జరిగిందా? అయినా గతం తాలూకు సంఘటనలను కూడా అడ్డం పెట్టుకొని ఉద్యోగ నిర్వహణ వదిలేసి, సేవ కార్యాక్రమాల పేరు చెప్పి, అక్రమాలు చేస్తుంటే కూడా మీడియా చూస్తూ ఊరుకోవాలా…? ప్రశ్నించకూడదు? అక్షరం రాయకూడదు? తనకు వ్యతిరేకంగా రాస్తే నిందలేస్తా? లేకుంటే కేసులు నమోదు చేయిస్తా? అనగానే సరిపోదు…మీడియా తన కర్తవ్యం నుంచి పారిపోదు…మీడియా అన్నది సజీవమైన ఒక వ్యవస్ధ…వ్యక్తులు భయపేట్టాలని చూస్తూ వణికేదు…బెనికేది కాదు…ప్రజా స్వామ్యానికి నాలుగో స్ధంభం…దాన్ని కూడా కలుషితం చేస్తా…నేను చేసే తప్పులన్నీ ఒప్పులని రాయించుకుంటా? అనుకుంటే అక్షరాలెవరికీ బానిసలు కాదు…? ప్రశ్నలకు ప్రతిరూపాలు…అన్యాయాలను ఎదిరించే అస్త్రాలు!