
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్లస్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నీ జర్నలిస్టులు కోరారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు కలెక్టర్ నీ కలిసి ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరారు. ఇతర జిల్లాలో ఇచ్చిన ప్రోసెడింగ్ జీవో కాపిని అందజేస్తూ అదే విధంగా తమకి ఇవ్వాలని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులoదరికీ ఇళ్లస్థలాల కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.