భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలోని భూపాలపల్లి మండల తహసిల్దార్ ఆఫీస్ ముందు ఆశ వర్కర్ల నిరవధిక సమ్మె చేయడం జరిగింది ఈ సమ్మె తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మెట్టుకొండ లక్ష్మి అధ్యక్షతన జరిగింది దీనికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కంపేటి రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ప్రారంభించడం జరిగింది ఈ నిరవధిక సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిరవధిక సమ్మె జరుగుతా ఉంది ఈ ప్రభుత్వం అనేకసార్లు ఆశా వర్కర్లు ధర్నాలు చేసిన సమ్మెలు చేసిన పట్టించుకునే పరిస్థితిలో లేదు కాబట్టి ఆశ వర్కర్లు నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి ముఖ్యంగా నిత్యవసర సరుకుల ధరలు పెరగడం వలన ఆశ వర్కర్ల జీతాలు 18 వేల రూపాయలు పెంచి ఫిక్స్డ్ వేతనం చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పర్మినెంట్ చేయాలని ఆరు నెలల పిఆర్సి బకాయిలు ఇవ్వాలని కరోనా రిస్క్ అలవెన్స్ 16 నెలలవి ఇవ్వాలని నాణ్యమైన డ్రెస్సులు ఇవ్వాలని ఏఎన్ఎం జిఎన్ఎమ్ ట్రైనింగ్ చేసిన ఆశ వర్కర్లను పర్మినెంట్ చేయాలని టిబి తెమడ డబ్బాలను ఆశలతో మోపించరాదు పారితోషకాలు లేని పనులను ఆశ వర్కర్లతో చేయించకూడదు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కుమారి రమక్క సప్పియ మమత తదితరులు పాల్గొన్నారు