అమెరికా మిచిగాన్ సాగినా లో ఘనంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకలు

ఉత్తరమెరికా లోని మిచిగాన్ స్టేట్, సాగినా లో సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట చాలా ఘనంగా  వైభవంగా జరిగింది.

మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్ట కార్యక్రమం లో అఖండ దీపారాధన, అంకురార్పణ, పంచగవ్య ప్రాషణ, వాస్తు మంటపారాధన ల తో పాటు,

సాయిబాబా, దత్తాత్రేయ మరియు నవగ్రహ హోమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమాలన్నీ “బ్రహ్మశ్రీ” భాగవతుల యుగంధర శర్మ (కూచిపూడి) గారి ఆధ్వర్యం లో ముగ్గురు పూజారులు నిర్వహించారు.

విగ్రహ ప్రతిష్ట లో భాగంగా శ్రీ యుగంధర శర్మ గారు అలంకరించిన సర్వతో భద్రమండల సకల దేవతారాధన విశేషంగా ఆకట్టుకున్నాయి. శర్మ గారు హొమారాధనలో పాల్గొన్న భక్తులకు సంస్కృతం లోని వేద మంత్రాలను తెలుగు లో అనువదించడం చాలా అభినందనీయం.

మూడు రోజుల పాటు సాయి నామ కీర్తనలు, మంత్రోచ్చారణతో సాయి సమాజ్ ఆఫ్ సాగినా ప్రతిధ్వనించింది.  జనవరి లో కేవలం నలుగురు స్నేహితులు కలిసి ప్రారంభించిన సాయి బాబా ధ్యాన మందిరం ఎనిమిది నెలల్లో దేవాలయం గా రూపు దిద్దుకునేందుకు చాలా ఆనందంగా ఉందని సాయి సమాజ్ ఆఫ్ సాగినా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మురళీ గింజుపల్లి అభిప్రాయ పడ్డారు. ఈ ఆలయ నిర్వహణ లో ప్రతి రోజు సహకరించిన శ్రీనివాస్ వేమూరి, హరిచరణ్  మట్టుపల్లి, శ్రీధర్ గింజుపల్లి, సాంబశివరావు, కొర్రపాటి, లీలా పాలడుగు, లక్ష్మి మట్టుపల్లి మరియు కృష్ణ జన్మంచి ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ సాయి బాబా విగ్రహం ను తన స్వంత ఖర్చులతో రాజస్థాన్ నుంచి తెప్పించిన శ్రీ వేమూరి నీలిమ-శ్రీనివాస్ దంపతులకు భక్తులందరు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. ఇంకా డాక్టర్ గింజుపల్లి మాట్లాడుతూ, ఇక్కడ ప్రతి గురువారం ప్రవాస భారతీయులందరు కలిసి భక్తి శ్రద్దలతో  సాయిబాబా హారతులు మరియు భజనలు నిర్వహిస్తున్నామని,ప్రతిష్టాత్మక  కార్యక్రమం ఇంత వైభవం గా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న పదిహేడు వేల చదరపు అడుగుల స్థలం లో భవిష్యత్తు లో ఉత్తర అమెరికా లోనే అతిపెద్ద సాయిబాబా ఆలయం నిర్మించే ఆలొచన లో ఉన్నామన్నారు. మూడు రోజుల ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం, సాయంత్రం సుమారు మూడు వందల మందికి అన్నదానం నిర్వహించారు.  అన్నదాన కార్యక్రమాన్ని శ్రీమతి నీలిమ శ్రీనివాస్ వేమూరి, సెల్వి విష్ణు కుమార్, తనూజ శ్రీనివాస్ వడ్డమాని, మోనికా మహేష్ భుతి, పల్లవి అమిత్ షహసానె, రోహిణి జితేంద్ర వైద్య, శుభ రఘు మెల్గిరి, కల్పన మురళీ తమ్మినాన, సుజని మురళీ గింజుపల్లి, హేమమాలిని మహేష్ సమతం మరియు నికిత రాహుల్ గుప్త నిర్వహించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో మిచిగన్ లో స్థిరపడ్డ  భారత సంతతి వైద్యులు డాక్టర్ కె.పి. కరుణాకరన్-లక్ష్మి, రఘురాం సర్వేపల్లి, నరేంద్రకుమార్, కిశోర్ బాబు- సామ్రాజ్యం కొండపనేని, సుబ్బారావ్-వాణి శ్రీ చావలి, సుబ్రహ్మణ్యం-సుందర యాదం,అనిరుధ్-విద్య భండివార్, విజయా రావ్ ల తో పాటు డెట్రాయిట్, ఫ్లింట్, గ్రాండ్ రాపిడ్స్, మిడ్ ల్యాండ్, బేసిటి, సాగినా, కెనడా ల నుండి సుమారు ఐదు వందల మంది ప్రవాస భారతీయులు హజరయ్యారు.  సుపరిచయ సుప్రసిద్ధ గాయకుడు మనో గారు ఈ వేడుకలకు హాజరయ్యారు.  సుమారు ఎనిమిది వందల భక్తులు భక్తి శ్రద్దలతో పాల్గొని ఘనంగా మూడు రోజుల వేడుకలు సమాప్తమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *