చొప్పదండి / నేటి ధాత్రి
కరీంనగర్ జిల్లాచొప్పదండి మండల పరిధిలోని ఆర్నకొండ గ్రామ పెట్రోల్ బంక్ నుండి మొదలయ్యే రాష్ట్ర రహదారికి ఇరువైపుల ఉన్నటువంటి చెట్లను కర్ర వ్యాపారాలు యదేచ్చగా రాత్రికి రాత్రే ఎలాంటి అనుమతులు లేకుండా కోయడం జరిగింది. అసలు అధికారులు ఉన్నట్టా? ఉండి లేనట్టా? అన్నట్టుగా ఉంది ఇక్కడి వ్యవహారం. ఇలా గతంలో కూడా జరిగినట్టు సమాచారం. ఇకపోతే ఫారెస్ట్ అధికారులు సరే సరే. అందాల్సిన అమ్యామ్యాలు అందితే చాలు చూసి చూడనట్టుగా వ్యవహారిస్తునరన్నా అభియోగాలు లేకపోలేదు. ఇలా కర్ర వ్యాపారులు ఎవరికీ నచ్చినట్టుగా వారి స్వలాభం కోసం చెట్లను నరక్కుంటూ పోతే ఎలా అని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మొక్కలను పెంచి అడవుల విస్తీరణాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తుంటే మరోపక్క కర్ర వ్యాపారులు వాటిని తుంచే ప్రయత్నాలను రాత్రికి రాత్రే జరిపేలా ఆలోచనలు చేయడం చట్టవిరుద్ధముగా భావించి చెట్లను నరికిన వారిపై పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియచేయడమైనది. దీనిపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారోనని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.