ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం కొనసాగింపు ఉత్తర్వులు ఆలస్యం కావడంతో అధ్యాపకుల సంఘం అతిథి ప్రతినిధులు పలుమార్లు కమిషనర్ కు సంబంధిత అధికారులకు మంత్రులను ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యను వివరించి వినతి పత్రాలు సమర్పించారు.ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్ అతిథి అధ్యాపకుల కొనసాగింపుకై అనుమతినిస్తూ జూన్ 15వ తారీకు నుండి వీరిని విధుల్లోకి తీసుకుంటున్నామని ఉత్తర్వులు జారీ చేశారు.దీని ద్వార *1654 మంది అతిథి అధ్యాపకులలో సంతోషం వెల్లివిరిసింది* ఈ సందర్భంగా అతిధి అధ్యపకుల సంఘం రాష్ట్ర ప్రతినిధి ఏర్పుల దాస్ మాట్లాడుతూ *అతిథికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం* అని కొనియాడారు. ఈ ఉత్తర్వులకు సహకరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిశ్రావు గారికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి గారికి ఇంటర్ బోర్డ్ కమీషనర్ ఒమర్ జలీల్ గారికి ఇంటర్ విద్య JAC చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారికి ప్రిన్సిపల్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు K S రామారావు,కళింగ కృష్ణ కుమార్ గారికి కాంట్రాక్ట్ లెక్చరర్ల జాక్ చైర్మన్ కనకచంద్రం కు అతిథి అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి పాష,రిపిక రాజ్ కుమార్ రాష్ట్ర మరియు జిల్లా అతిథి అధ్యాపకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు