అతి చిన్న వర్షానికే మంగపేట మండలం నడి సెంటర్లో నిలిచిన నీళ్లు
ఎమ్మార్పీఎస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ డిమాండ్
మంగపేట నేటిధాత్రి
గురువారం ఉదయం కురిసిన వర్షానికి మంగపేట బద్రి హోటల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు మంగపేట మండలం లోని నడి సెంటర్లో వరకు నిలిచిన వర్షపు నీరు .ప్రతి సంవత్సరం చిన్న వర్షం కురస్తే చాలు మంగపేట సెంటర్లో వర్షపు నీరు నిలువ ఉంటుంది అధికారులు ఆ నీళ్ళల్లోనుండి నడుచుకుంటూ పోతారు కానీ పట్టించుకోరు ఈ విషయాన్ని మండల అధికారులు కలెక్టర్ స్పందించి మంగపేట మండలం లో రోడ్ల మీద నిలువకుండా రోడ్లు చేయాలని మంగపేట తహసీల్దార్, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వెంటనే చర్య తీసుకొని నీళ్లు నిలువకుండా చేయాలనీ ఎమ్మార్పీఎస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ డిమాండ్ చేసారు .