
సిపిఎం ఆద్వర్యంలో తహశీల్దార్ కు వినతి
బోయినిపల్లి,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలని
సిపిఎం ఆద్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండలంలో నూతన బాద్యతలు చేపట్టిన తహశీల్దార్ పుష్పలతను సీపీఎం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి,
ఇసుక, చెరువు మట్టి అక్రమాలపై వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తహశీల్దార్ అక్రమ ఇసుక, మట్టి కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ శాఖ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచా అశోక్, సిపిఎం పార్టీ నాయకులు ఎలిగేటి రాజశేఖర్ పాల్గొన్నారు.