
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీటీసీ నాగం కుమార్ మంగళవారం రోజున భూమి పూజ చేశారు. లక్ష రూపాయల జడ్పీ నిధులతో 5వ వార్డ్ లో ఏర్పాటు చేయనున్న హైమస్ లైట్ కు భూమి పూజ చేశారు. మల్లికార్జున కురుమ సంఘం నుండి బీరప్ప గుడి వరకు,వట్టెముల రాజు ఇంటి నుండి బస్ స్టాండ్ కు వెళ్లే రోడ్ వరకు ఏర్పాటు చేయనున్న సి సి రోడ్డు కు అలాగే ముదిరాజ్ కుల సంఘ భవనం మల్లికార్జున మున్నూరు కాపు కుల సంఘ భవనాలకు భూమి పూజ చేశారు. జోగాపూర్ గ్రామానికి సీసీ రోడ్డు లకు 8 లక్షలు, కుల సంఘ భవనాలకు 8 లక్షలు ఇ జి ఎస్ నిధుల నుండి, హైమస్ లైట్ కోసం జెడ్ పి నిధుల నుండి లక్ష రూపాయలు మొత్తం 17 లక్షల నిధులు మంజూరు అయినట్టు జెడ్ పి టి సి నాగం కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ చందర్తి మండలంలో అన్ని గ్రామాలను సమదృష్టితో అభివృద్ధి చేస్తామన్నారు, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సహకారంతో మరిన్ని నిధులు వెచ్చించి అభివృద్ధిలో ముందుంటామన్నారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, చింతపండు రామస్వామి,ఎంపీటీసీ మ్యాకల గణేష్, నాయకులు గోట ప్రభాకర్ , జలపతి, ధర్మపురి శ్రీనివాస్, సంతపూర్ బాలు, నాత నావీన్ రాజ మల్లయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.