చిట్యాల, నేటి ధాత్రి :
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్యాల మండలం నైన్ పాక ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ను బుధవారం రోజున జడ్పిటిసి గొర్రె సాగర్*ప్రారంభించి, ప్రదర్శించిన ఎక్స్బిట్ లను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిదీ సైన్స్ తో ముడిపడి ఉందని సైన్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాలలో వ్యాసరచన, ముగ్గుల పోటీలు, క్విజ్ కాంపిటీషన్* నిర్వహించామనిపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ* తెలిపారు. అనంతరం సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్, సైన్స్ ఉపాధ్యాయులు స్వాతి, రాజశేఖర్, ఉపాధ్యాయులు సుధాకర్, ప్రణీత, విజయశాంతి ,లింగయ్య ,సతీష్, శ్రీధర్, ఓదెలు , సిఆర్పి తిరుపతి పాల్గొన్నారు.