జహీరాబాద్ మున్సిపాలిటీలో 38 లక్షల పన్ను వసూలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీలో గత మూడు రోజుల్లో రూ.38 లక్షల ఆస్తి మరియు వాణిజ్య పన్నులు వసూలయ్యాయని కమిషనర్ జయతురం శనివారం తెలిపారు. పన్నుల వసూలును వేగవంతం చేయడానికి కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నో డ్యూ సర్టిఫికెట్లను పొందడానికి అన్ని రకాల పన్నులను చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.
