జహీరాబాద్ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సెప్టెంబర్ 13 న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి..
రాజీ మార్గమే..రాజ మార్గం! రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చు…
ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఈ సందర్భంగా ఎస్ఐ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని,అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. మండల వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడేలా జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
రాజీ పడదగిన కేసులు:
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,
సివిల్ తగాదా కేసులు,
ఆస్తి విభజన కేసులు,
కుటుంబపరమైన కేసులు,
వైవాహిక జీవితం సంబంధిత కేసులు,
బ్యాంకు రికవరీ,
విద్యుత్ చౌర్యం,
చెక్ బౌన్స్ కేసులు
కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీకి అవకాశం ఉంటుంది అన్నారు.
కానిస్టేబుల్ నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరు భాద్యతగా వ్యవహరించి, రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలన్నారు. జాతీయ లోక్-అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జరుగుతుందని అవగాహన కల్పించాలని అన్నారు.
