
Zaheerabad Girl Shines in Group-1
జహీరాబాద్ యువతికి గ్రూప్-1 లో ఘనవిజయం
డిప్యూటీ కలెక్టర్ హోదా సాధించిన క్రిస్టినా ఇవాంజిలీన్…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన డీ.ఏ. క్రిస్టినా ఇవాంజిలీన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక గ్రూప్-1 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదాకు ఎంపికయ్యారు. క్రిస్టినా డీ. ఆనంద్, సుగుణ దంపతుల కుమార్తె. ఆమె ఎలూరి కిరణ్ కుమార్ సతీమణి. ప్రస్తుతం వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
“ఈ విజయాన్ని నా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను. వారి తోడ్పాటు, ప్రోత్సాహం లేకుండా ఈ స్థాయికి చేరుకోలేను. ప్రతి ఒక్కరిలోను గ్రూప్-1 సాధించగల సామర్థ్యం ఉంది. క్రమశిక్షణ, దృఢనిశ్చయం, పట్టుదల ఉంటే ఏ విజయం సాధ్యం అవుతుంది.” అని పేర్కొన్నారు.
ఆమె విజయం కుటుంబ సభ్యులతో పాటు జహీరాబాద్ ప్రజలకు గర్వకారణంగా మారింది. యువతకు ఈ విజయం ప్రేరణగా నిలుస్తోంది.