
Minister Vivek
మంత్రి వివేక్ గారిని కలిసిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బృందం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి గారిని పెండింగ్ లో ఉన్న మరియు పలు నూతన అభివృద్ధి పనులకోసం కలిసి మాట్లాడిన జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బృందం.జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎ చంద్ర శేఖర్, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రామలింగారెడ్డి,ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, న్యాల్కల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్ సంగ్రామం పాటిల్, రాజు స్వామి, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్ తధితరులు కలిసి మంత్రి గారితో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులు తక్షణమే మొధలు పెట్టి పూర్తి చెయ్యాల్సిందిగా మరియు నియోజకవర్గం లో గల వివిధ గ్రామాలకు లింక్ రోడ్లు కావాలని అడగడం జరిగింది మరియు వివిధ నూతనా అభివృద్ది పనులు అడిగారు అందుకు ఇంచార్జి మంత్రి సానుకులంగా స్పందించి త్వరలోనే పూర్తి చేయించేద్దమన్నారు.