
జహీరాబాద్ నియోజకవర్గంలో 2020 నుండి 25 వరకు జహీరాబాద్ నియోజకవర్గ బీసీ నేత శూన్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో బీసీలకు నేతలుగా తలెత్తని అవకాశాలు – 2020 నుండి 2025 వరకు బీసీ నేతల సంఖ్య శూన్యం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 2020 నుండి 2025 వరకూ బీసీలకు రాజకీయ పట్ల ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో జెడ్పిటిసిలు, ఎంపీపీ పదవుల్లో బీసీలకు ఒక్క అవకాశం కూడా దక్కకపోవడం ఆవేదన కలిగించే అంశంగా నిలిచింది. నియోజకవర్గంలో ఉన్న మొత్తం పదవుల్లో రెండు ఓసీలకు, మూడింటిని ఎస్సీలకు కేటాయించారు. అయితే, బీసీలకు మాత్రం ఒక్క నాయకత్వ పదవీ బాధ్యత కూడా లభించకపోవడం శోచనీయమని స్థానిక బీసీ సంఘాలు వాపోతున్నాయి. పది శాతం వర్గాలైన ఓసీలకు పదవులు ఇవ్వడం, 18 శాతం ఉన్న ఎస్సీలకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుంటే, దాదాపు 52 శాతం ఉన్న బీసీలను పూర్తిగా విస్మరించడం అన్యాయమని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. నాయకత్వం లేకపోవడంతో బీసీ వర్గ సమస్యలు అధికారికంగా ప్రతిఫలించకపోతుండడం, అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని పక్కన పెట్టడం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ తరహా విభజనలపై బీసీ సంఘాలు, యువత కఠినంగా స్పందిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో నాయకత్వంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ వైఫల్యాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నారు. లేనిచో కాబోయే రోజుల్లో జనరల్ అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని సంకేతాన్ని తెలియజేశారు.