Zaheerabad Congress Leaders Campaign in Jubilee Hills
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
◆:- తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి
◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా,హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి వారితో పాటు పుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహిం, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి,కూన.శ్రీశైలం గౌడ్,ఆవుల రాజిరెడ్డి మరియు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
