
YSRCP
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల కావాలని 516 కొబ్బరికాయలు కొట్టిన వైఎస్ఆర్ సీపీ నేతలు
పాకాల(నేటి ధాత్రి)అక్టోబర్ :07

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి’కి త్వరగా బెయిల్ మంజూరు కావాలని,ఆరోగ్యం బాగుండాలని పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో స్వామికి పూజ చేసి 516 కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని ప్రార్థించారు.శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిట అర్చన చేయించి,ప్రత్యేక పూజలు నిర్వహించారుచెవిరెడ్డి అక్రమ నిర్భంధానికి 112 రోజులని,చెవిరెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించడం దురదృష్టకరమన్నారు.ఈ కార్యక్రమంలో పాకాల మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.