*వైసీపీది యువత పోరు కాదు.. దగా పోరు..
*తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు మురళి..
పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 13:
టి ఎన్ ఎస్ ఎఫ్,
చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు వి.త్యాగరాజు ఆదేశాల మేరకు ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలమనేరులో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ
వైసిపీ యువత పోరు పేరుతో తలపెట్టిన కార్యక్రమం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
2014- 2019 అప్పటి టిడిపి పాలనలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయెంబర్స్ మెంట్ ఇస్తే. జగన్ రెడ్డి పాలనలో దానిని కుదించి కాలయాపన చేస్తూ 7 లక్షల పేద విద్యార్థులను మోసగించింది మీరు కాదా అంటూ ఘాటుగా విమర్శించారు. ఇంకా సిగ్గు లేకుండా వైసిపి నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన బకాయిల వలన డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, త్రిబుల్ ఐటీ ఇతర కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు ఎన్నో అష్టకష్టాలు పడ్డారని గుర్తుచేశారు. ఉన్నత విద్య చదివే అవకాశం లేకుండా విద్యార్థులు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కోల్పోయారన్నారు.ఐదు సంవత్సరాల్లో ఏడాదికి నాలుగు విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. ఇవ్వని ఫీజులకు కూడా పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుని దగా కొట్టింది అప్పటి వైసీపీ ప్రభుత్వం కాదా అంటూ సునీల్ రాజు మండిపడ్టారు.మీ మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో నేటి యువత లేదని. మీకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకి పరిమితం చేసినా.. ఇంకా సిగ్గు రాలేదని మురళి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సతీష్ కుమార్ యశ్వంత్ మహేష్ బాబు బాలవిన్ మురళి కుమార్ అనిల్ కుమార్ గణేష్ గణేష్ కుమార్ పాల్గొన్నారు..