ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
మహాదేవపూర్ నేటి ధాత్రి :
మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వారు మాట్లాడుతూ పేద ప్రజల మన్ననలు పొందిన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిఅని పేద ప్రజల కోసం ఆరోగ్య శ్రీ పథకం, ఫీజు రియంబర్నమెంట్ 108 వాహనం ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు చేరవేసిన మహానేత అని కొనియాడారు వైయస్సార్ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ గారు, ఫ్యాక్స్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి గారు, మాజీ ఎంపీపీ బాన్సువాడ రాణి బాయి రామారావు గారు,మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్ గారు,మాజీ పాక్స్ చైర్మన్ వామన్ రావు గారు,అంబట్ పల్లి మాజీ సర్పంచ్ ఎరవెల్లి విలాస్ రావు గారు, దేవస్థానం డైరెక్టర్ పద్మ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తడకల జగదీశ్,దాగం సంతోష్, రాఘవేంద్ర,కడర్ల నాగరాజు, చెక్రధర్,పోత రామకృష్ణ, చెంద్రశేఖర్ రెడ్డి,అయిత తిరుపతి రెడ్డి, శంకర్, బాపు లక్ష్మయ్య తదితరులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.