నిరుపేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్ఆర్
నర్సంపేట,నేటిధాత్రి:
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ అన్నారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ 76 వ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన నాయకులు ఘన నివాళులర్పించారు.
రాజేందర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజా సంక్షేమమే నిదానంగా ప్రభుత్వం నడవాలని ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజ్ రియింబర్స్ మెంట్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇల్లు, పావలా వడ్డీకే రుణాలు, వడ్డీ లేని రుణాలు, జలయజ్ఞంతో, సహా ఎన్నో గొప్ప పథకాలను తీసుకువచ్చి పథకాల అమల్లో దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు.తన పాదయాత్రతో 2004, 2009, వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన గొప్ప నేత దిగంగత వైయస్ఆర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,మాజీ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్,ములుకల సాంబయ్య,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్,పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, మాజీ సర్పంచ్ చిలువేరు రజిని భారతి, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ పద్మాబాయి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శులు నూనె పద్మ, తక్కళ్ళపెల్లి ఉమా, పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శులు చిప్ప నాగ, నాడెం నాగేశ్వర్లు, మాజీ వార్డు మెంబర్లు పేరం బాబు రావు, కొయ్యడి సంపత్ గౌడ్, గండి యాదగిరి గౌడ్, లక్కార్సు రమేష్, పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి శ్రీనివాస్, కోల చరణ్ గౌడ్,గద్ద జ్యోతి,దేశి లక్ష్మీ, బైరి మురళి, దండెం రతన్ కుమార్, ఖాజాబీ, వేల్పుల శ్రీలత, కటారి ఉత్తమ్ కుమార్, నాగేల్లి సారంగం గౌడ్,దేశిసాయి పటేల్, సామల ప్రశాంత్, వరంగంటి సాయి విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.