ప్రజల హృదయాల్లో నిత్యం నిలిచే నేత “,వైఎస్సార్ ‘
రాయికల్ నేటి ధాత్రి. .
పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద జన హృదయ నేత ప్రజా బంధు సర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కేసు కట్ చేసి ఒకరికి ఒక్కరు తినిపించుకున్నారు ఇట్టి సందర్భం,జిల్లా నాయకులు గోపి రాజారెడ్డి మాట్లాడుతు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా గతం వై ఎస్ ఆర్ చేప్పట్టిన సేవలు చాలా గొప్పవని వృద్దులకు దివ్యాంగులకు పెన్షన్ తోపాటు రైతుల జీవితాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ఉచిత విద్యుత్ ,నీటి ప్రాజెక్ట్ లు,రాష్టాన్ని అబివృద్ది పథం వైపు నడిపారని అయన మరణ అనంతరం అదే లక్ష్యంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ,ఉచిత కరెంట్ సబ్సిడీ సిలెండర్ లాంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ,అనంతరం పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ మాట్లాడుతూ మహిళకు పావలా వడ్డీ రుణాలతో అభివృద్ధి పథంలో నిలిపి పేదలకు అండగా ఆరోగ్య శ్రీ పథకం తోపాటు పాటు 108,104 పథకాలను ప్రవేశ పెట్టి పేదలకు వైద్యం అందించిన మహానేత ఆదర్శంతోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు ,పేదలకు ఉచిత విద్యుత్ ,ఆరోగ్య శ్రీ ,లతోపాటు రైతు భరోసా ,రేషన్ కార్డు లు మంజూరు ఇందిరమ్మ ఇండ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమమంలో కొయ్యడి మహిపాల్ రెడ్డి ,తంగెళ్ల రమేష్ తలారి రాజేష్ , గుజ్జులా మోహన్ రెడ్డి ,దాసరి గంగాధర్ ఎండి షాకీర్ ,మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ ,తాటిముల రవి, సుంకరి భూమయ్య భుమాగౌడ్ , పొన్నం శ్రీకాంత్ కిరణ్ రెడ్డి ,శామీర్ ,కిరణ్ ,రాంకీ ,శివకుమార్ ,సాగర్ ,రాకేష్ నాయక్ ,మురళి ,నందునాయక్ ,గోపాల్ ,అశోక్ ,కటుకం సాయికుమార్ ,రమేష్ ,శివ ,రవి , రాజీవ్ ,కె నరేష్ , బి నవీన్ తదితరులు పాల్గొన్నారు