డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఉయ్యాలమడుగు గ్రామంలో ఆరోగ్య శిబిరం
నేటి ధాత్రి చర్ల
మలేరియా ప్రభావిత ప్రాంతం మారుమూల ప్రాంతమైన ఉయ్యాల మడుగు గ్రామంలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు
ఈ ఆరోగ్య శిబిరం లో నలభై అయిదు మందికి ప్రభుత్వఆరోగ్య సేవలు అందించారు
జ్వరంతో బాధపడుతున్న ఇద్దరు నుండి రక్త పరీక్షలు చేసి సాధారణ జ్వరం గా నిర్ధారించి వైద్యం అందించడం జరిగినది
అనంతరం ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న సికిల్ సెల్ అనీమియా టెస్టులను పరిశీలించారు
అనంతరం గ్రామంలో జరుగుతున్న దోమల మందు పిచికారి కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగినది
డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఉయ్యాల మడుగు గ్రామం చతిస్గడ్ రాష్ట్రానికి అతిసమీపంగా ఉండడం బంధు మిత్రులందరు సతీష్గడ్ రాష్ట్రం నుండి రాకపోకలు అధికంగా జరగడం వలన మలేరియా ప్రబలే అవకాశం ఉన్నది గనుక ఎవరైనా సతీష్గడ్ వెళ్లిన లేదా బంధువులు వచ్చి వెళ్లిన వెంటనే మలేరియా పరీక్షలు చేయించుకోవడం మంచిదని జ్వరం వచ్చినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ కి మాత్రమే రావడం ద్వారా మలేరియా పరీక్షలు చేసి వైద్యం అందిస్తారని తెలియజేశారు
సీజనల్ వ్యాధులు పెరగకుండా సాధ్యమైనంత వరకు దోమలు కుట్టకుండా చూసుకోవాలని దోమతెరలు కంపల్సరీ వాడాలని కాచి చలార్చిన నీటిని మాత్రమే త్రాగాలని ఆహారం వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మొబైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సచిన్ సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ గోపి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తులసి మొబైల్ స్టాప్ నర్స్ దీక్షిత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు