టిడిపి తీర్థం పుచ్చు కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి03:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మరియు అభివృద్ధికి అందులోని మంచిని గ్రహించి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న అభివృద్ధిని మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న రొంపిచర్ల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రొంపి చెర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఇబ్రహీం ఖాన్ మండల వైస్ ఎంపీపీ నూలు రెడ్డప్ప మాజీ జెడ్పిటిసి చంద్రమ్మ భాస్కర్ రెడ్డి
రొంపిచెర్ల ఎంపీటీసీ రహిమాబీ , బండ కింద పల్లె సర్పంచ్ అన్సర్ బాష, రొంపిచర్ల వైస్ సర్పంచ్ శ్రీపతి,
జాండ్లా వారిపల్లి వైస్ సర్పంచ్ బాలాజీ,రొంపిచర్ల వార్డ్ మెంబర్లు నాగరాజా లక్ష్మయ్య మొదలైన వారు అనుచరులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధికి ఆకర్షితులై ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజలను మరింత అభివృద్ధి చెందే విధంగా తమ వంతు కృషి చేస్తూ చల్లా రామచంద్రారెడ్డి నాయకత్వంలో పని చేస్తామని తెలియజేశారు..