
Collector Sandeep Kumar Jha
డ్రగ్స్ కు దూరంగా ఉండాలి యువత లక్ష్యం వైపు ప్రయాణించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన కలెక్టర్
సిరిసిల్ల టౌన్ :(నేటి దాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని.. లక్ష్యం వైపు పయనించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.జిల్లా నార్కోటిక్ కంట్రోల్
సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డీ.పీ.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా సంస్థల వద్ద డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు.
అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మాట్లాడారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు , యువతకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు చేపట్టి విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.సమావేశంలో డీ.ఎం.హెచ్.ఓ రజిత, డీఏఓ అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, డీఐఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.