సి ఐ రాజ్ గౌడ్
ఎస్ ఐ మధుసూదన్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
గంజాయి సేవించిన అమ్మిన కేసులు నమోదు చేస్తామని మంథని సీఐ రాజ్ గౌడ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో గంజాయి సైబర్ క్రైమ్ గురించి స్థానిక ఎస్ఐ మధుసూదన్ రావుతో కలిసి కాసర్ల గడ్డ ముత్తారం లో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు వ్యసనాలకు దూరంగా ఉండాలని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అన్నారు
గ్రామాలలో ఎవరు కూడా సైబర్ క్రైమ్ వలలో పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు గాని మీసేజులకు స్పందించకుడదని సూచనలు చేశారు.బ్యాంకుల నుండి వచ్చే మీసేజులకు ఓటిపి చెప్పాలని ఎవరైనా అడిగితే అటువంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూధన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.