
యువత మొబైల్ వీడి క్రీడల్లో పాల్గొనాలి
నర్సంపేట టౌన్ సిఐ రఘుపతిరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
సోషల్ మీడియాలో చెడుకు,ఇతర వ్యసనాలకు బానిసగా సెల్ ఫోన్ ద్వారా ప్రభావితం అవుతున్న యువత సెల్ ఫోన్లు వీడి క్రీడల్లో పాల్గొని మానసికంగా శారీరకంగా అభివృద్ధి చెందాలని నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతిరెడ్డి పిలుపునిచ్చారు.నర్సంపేట మండలంలోని రాజపల్లి గ్రామంలో ఖో ఖో,వాలీబాల్ కోర్ట్ లను టౌన్ సిఐ రఘుపతిరెడ్డి స్థానిక ఎస్సై అరుణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత ,పిల్లలు మొబైల్ వీడాలి – క్రీడలు ఆడాలి అను నినాదం గ్రామాల్లోని యువతకు మార్గనిర్దేశం అని పేర్కొన్నారు.మాజీ ప్రజా ప్రతినిధులు,అధికారులు,యువకులు పాల్గొన్నారు.