Youth Should Excel in Sports: CM Cup Torch Rally Launched
యువత క్రీడల్లో రాణించాలిసీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభించిన ఎస్సై క్రాంతి కిరణ్
కేసముద్రం/ నేటి ధాత్రి
క్రీడా ప్రతిభను వెలికితీయడానికి యువత క్రీడల్లో రాణించాలని.. యువతకు, విద్యార్థిని, విద్యార్థులకు ఎస్సై క్రాంతి కిరణ్ టార్చి రాలిని ప్రారంభిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సీఎం కప్ క్రీడలు రెండో సెషన్ లో భాగంగా సీఎం కప్ టార్చి రాలిని ఏర్పాటు చేశారన్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలగడానికి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి సీఎం కప్ క్రీడలు ఇంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులకు నగదు పురస్కారం అందజేస్తూ ప్రోత్సహిస్తుంది అన్నారు. క్రీడల అభివృద్ధి కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ మరియు స్పోర్ట్స్ స్కూల్ లను ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. గ్రామీణ యువతకు, విద్యార్థులుకు ఆ కళాశాలలు,పాఠశాలలో క్రీడల్లో రాణించడానికి,మెలుకువలు నేర్చుకోవడానికి..ఎంతో ఉపయోగపడతాయన్నారు. కాగా స్థానిక ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ ఈనెల 8 వ తేదీ ఈ టార్చి ర్యాలీని కలెక్టర్ కార్యాలయంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే,కలెక్టర్ ఆధ్వర్యంలో టార్చ్రాలిని ప్రారంభించారు. సీఎం కప్ లాంటి క్రీడలు విద్యార్థి దశ నుండే క్రీడలను భాగం చేయడం ఉద్దేశంతో క్రీడలను ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. అనంతరం టార్చి ర్యాలీని ఆర్టిఏ డైరెక్టర్ రావుల మురళి తీసుకొని, ఉత్సాహంగా కదిలారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రాజు, నీలం దుర్గేష్, మేకల వీరన్న, అంబటి మహేందర్ రెడ్డి, దస్ర్రూ నాయక్ , డి వై ఎస్ ఓ ఓలేటి జ్యోతి, ఫిసికల్ డైరెక్టర్స్ కొమ్ము రాజేందర్, కొప్పుల శంకర్, దా మల్ల విజయ చందర్, కే పద్మ, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.
