
పెద్ద కొడప్ గల్ ఎస్సై మహేందర్
కామారెడ్డి జిల్లా/పెద్ద కొడప్గల్ నేటి ధాత్రి:
యువత క్రీడల్లో రాణించాలని పెద్ద కొడప్ గల్ ఎస్సై మహేందర్ అన్నారు.ఆయన బుధవారం పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో “కాటేపల్లి ప్రీమియర్ లీగ్” ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.క్రీడలతోపాటు కష్టపడి చదివి ఊరికి ,కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని ఎస్సై యువతకు సూచించారు.క్రీడాకారులకు క్రికెట్ జెర్సిలు అందజేసిన రామాగౌడ్ కు ఎస్సై సన్మానించారు.అంతరం ఎస్సై,ఏంఈఓ ప్రవీణ్ కుమార్ , పిఎస్ హెచ్ ఎం బాల్ రాజ్, లను గ్రామ పెద్దలు మల్లప్ప పటేల్ , మొగులాగౌడ్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు యువకులు పాల్గొన్నారు.