రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఎక్స్ రోడ్ వద్ద స్వామి వివేకానంద 123వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ యువజన అవార్డు గ్రహిత అలువాల విష్ణు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు , ప్రజలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈసందర్భంగా జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణులు మాట్లాడుతూ యువత సన్మార్గంలో ప్రయాణించాలని, స్వామి వివేకానందుడు కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతికిన ఆయనను నేడు మనం కూడా ఆదర్శంగా తీసుకుంటున్నామంటే కారణం ఆయన యొక్క దార్శనికతనే ముఖ్య కారణమని, విశ్వమంతా ఆధ్యాత్మిక వివేకానంద చేరపలేని జ్ఞాపకముగా విశ్వమంతా భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద పడి లేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని మందలో ఒక్కడివి కాక వందలో ఒకరిగా నిలవాలని, వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోతామని, అన్నార్థులు అనాధలు అవనిపై ఉండవద్దని, ఈభూవిపై ఆకలితో కుక్క కూడా చావద్దని, ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్న యువకులని వజ్రమంటి మనసు ఉన్న భరతమాత పుత్రులు ఈదేశ తలరాతను మారుస్తానన్న స్వామి వివేకానంద ఆలోచనలతో నేటి యువత ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి తెలంగాణకు నూతన యువజన విధానాన్ని ప్రకటించి, యువజన సంఘాల బలోపేతానికి కృషి చేస్తూ, స్వామి వివేకానంద జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌరీ రమేష్, నాయకులు టీ.అనిల్ కుమార్, నేరెళ్ళ ఆంజనేయులు గౌడ్, నాగుల రాజశేఖర్ గౌడ్, లేఖరాజు, యువజన సంఘాల నాయకులు అమరిశెట్టి భూమిరెడ్డి, గజ్జెల అశోక్, కొలిపాక కమలాకర్, పన్యాల అశోక్ రెడ్డి, ముదిగంటి ఆనంద్ రెడ్డి, నేరెళ్ల మారుతి గౌడ్, ఏస్.అంజన్ కుమార్, అలువాల శంకర్, అనిల్ కుమార్, కె.రాజు, బిరెడ్డి కరుణాకర్ రెడ్డి, నవీన్, మహేష్, రాజ్ కుమార్, కొలిపాక ప్రవీణ్ కుమార్, సాయి ప్రసాద్, హర్షవర్ధన్, ప్రశాంత్, మధు, రాంచరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.