
దేశ రక్షణలో యువత ముందుండాలి….
రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)
దేశ రక్షణలో యువత ముందుండాలని రామాయంపేట ఎస్సై బాలరాజు సూచించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం యువకులు, ఆర్మీలో చేరాలని తెలిపారు. దేశ రక్షణ కోసం విరోచితంగా పోరాడి పాకిస్థాన్ కు ముచ్చమటలు పట్టించిన యుద్ధ వీరులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
పోరాటంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించాలన్నారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రావాలన్నారు. దేశం కోసం ఎంతోమంది యువకులు సైన్యంలో చేరి దేశ సేవ కోసం పాటుపడుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో షానిషా ఫౌండేషన్ చైర్మన్ శివ, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ యాదగిరి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు భాస్కర్, సత్యం, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.