చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కేంద్రంలో
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో క్రికెట్ క్లబ్ చందుర్తి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చందుర్తి ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ సోమవారం విజయవంతంగా ముగిసింది.
ఇట్టి టోర్నమెంట్లో మొత్తం ఐదు టీములు పాల్గొనగా ఒక్కొక్కటి నాలుగు చొప్పున మ్యాచ్లు ఆడారు. సోమవారం యాకూబ్ టీం కి, చింటూ టీం కి హోరా హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో యాకూబ్ టీం గెలిచి టోర్నీ విజేతగా నిలిచింది…
టోర్నీ ప్రధమ విజేత యాకూబ్ టీం కి బహుమతితో పాటు రూపాయలు 10116, రెండవ విజేత చింటూ టీం కి బహుమతితోపాటు రూపాయలు 5116 పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రముఖులు అందజేశారు….
యువత సెల్ ఫోన్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడేందుకు క్రీడలను ఏర్పాటు చేసిన క్రికెట్ క్లబ్ వారిని పలువురు అభినందించారు.