సర్పంచ్ బరిలో యువ నాయకుడు రవికుమార్
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ముదిగుంట పంచాయతీ ఎన్నికల్లో యువ నాయకుడు ఆకుల రవికుమార్ సర్పంచ్ పదవి కోసం బరిలో నిలిచాడు.ఎల్లప్పుడూ గ్రామస్తులకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.సర్పంచ్ పదవి కాలం పూర్తయి రెండు సంవత్సరాలు అవడంతో గ్రామంలో అనేక సమస్యలు పేరుకు పోయాయని రవికుమార్ అన్నారు.ఈ స్థానిక ఎన్నికలలో తనని సర్పంచిగా గెలిపిస్తే గ్రామానికి సేవ చేసుకుంటానని,అలాగే గ్రామ పంచాయతీలోని సమస్యలని పూర్తిగా తీర్చి ఆదర్శ గ్రామంగా నిలబెడతానని గ్రామస్తులకు తెలిపారు.తను సర్పంచ్ బరిలో గెలవడానికి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
