# నర్సంపేట నియోజకవర్గ చేరికల కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి
# మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన రాజుపేట యువకులు
నర్సంపేట,నేటిధాత్రి :
యువతకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని బిజెపి నర్సంపేట నియోజకవర్గ చేరికల కమిటీ ఛైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండల అధ్యక్షులు గంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజుపేట గ్రామానికి చెందిన 10 మంది యువకులకు బీజేపీ చేరగా డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావాలన్నారు.ఈ రాబోయే ఎన్నికల్లో భాజపా గెలుపుకై ప్రతి ఒక్క యువకుడు సైనికుల్లగా పని చెయ్యలని సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపెళ్లి నర్సింహా రాములు ,జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్,సీనియర్ నాయకులు బాల్నె జగన్,పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు గౌడ్,దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్,పట్టణ కౌన్సిలర్ లునావత్ కవిత వీరన్న తదితరులు పాల్గొన్నారు.