నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన విష్ణుదాస్ వంశిదర్ కు పినాకిని మీడియా వారి యూత్ ఐకాన్ అవార్డ్ కు ఎంపికయ్యారు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తునే,రాజకీయ,బ్రాహ్మణ సంఘాల తో పాటు సమాజ సేవకు అతడు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పినాకిని మీడియా సంస్థ 8 వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతి లో జరిగిన ప్రత్యేక కార్యక్రమములో సంస్థ వ్యవస్థాపకులు వంశీ శాస్త్రి,రుద్రవీణ,బాల సుబ్రమణ్యం,రాఘవేంద్ర రావు,మోటివేషన్ స్పీకర్ శశిధర్ లు ఈ అవార్డ్ తో సత్కరించారు.
యూత్ ఐకాన్ అవార్డ్ గ్రహీత విష్ణుదాస్ వంశీధర్
