
Congress Seva
యూత్ కాంగ్రెస్ సేవా సమితి ఆపన్నహస్తం:
గుండె సమస్యతో బాధపడుతున్న నిరుపేదకు కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం
రాయికల్, జూలై 16, నేటి ధాత్రి.
మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన సామల్ల లక్ష్మీనారాయణ గుండె సమస్యతో బాధపడుతూ నిరుపేదరికంతో ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ సేవా సమితి, ఇటిక్యాల వారు చలించిపోయారు.
మానవతా దృక్పథంతో స్పందించి, లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు