Case Demanded Against Youth Congress Leader Pawan
యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ పై కేసు నమోదు చేయాలి
ఎల్తూరి సాయికుమార్ స్వేరో
హన్మకొండ, నేటిధాత్రి:
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజున హనుమకొండ జిల్లా లో మీడియా సమావేశంలో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయపరంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కాంగ్రెస్ పథకాల వైఫల్యాలను ఎండగడుతూ ఆరోపించడం జరిగింది. దీనికి ప్రతి ఆరోపణగా యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వ్యక్తిగతంగా గుండు మీద బొచ్చు లేదు గుండు లోపల మెదడు లేదు అంటూ పలికిన మాటలను యావత్ తెలంగాణ రాష్ట్ర స్వేరోస్ ,అభిమానులు ,విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందున తోట పవన్ పై కేసు నమోదు చేయాలని హనుమకొండ ఎస్ హెచ్ ఓ ఇంచార్జ్ ఎస్ఐ సతీష్ కి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అధ్యక్షులు చెట్టుపల్లి శివకుమార్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఒకేషనల్ కాలేజ్ నాయకులు రణధీర్ ,చరణ్ ,వినయ్ తదితరులు పాల్గొన్నారు.
