ఉత్తమ ఫలితాలు సాధించాలి : దాత యూత్ కాంగ్రెస్ నాయకులు నక్క సందీప్ గౌడ్
* 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని స్నాక్స్ దాత, యూత్ కాంగ్రెస్ నాయకులు నక్క సందీప్ గౌడ్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్పేట్, దేవరయాంజాల్, బొమ్మరాసిపేట్ గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్నాక్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాలేష్, వేణు లతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పరీక్షల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి, ఒత్తిడిని తగ్గించుకొని చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆర్టీఏ సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి, పాఠశాల ఛైర్మన్ కట్ట మీనా కుమారి, శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ఛైర్మన్ పేండం లక్ష్మినారాయణ, ధర్మకర్త ఎల్లెంకి భారతి, కట్ట మైసమ్మ దేవాలయం ఛైర్మన్ మేకల మహేందర్ యాదవ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాష్కీ శంకర్ గౌడ్, విలాసాగర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మేకల అంజనేయులు, పంబలి అశోక్, తాళ్ల శ్రీనివాస్ రెడ్డి, సోగడ బాల్ రాజు, ఇదిగాళ్ల యేసు దాసు, తలారి భరత్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి రమేశ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
