
"Young Woman Goes Missing in Zaheerabad"
యువతి అదృశ్యం.. కేసు నమోదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో అదృశ్యం కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ గ్రామీణ ఎస్సై కాశీనాథ్ తెలిపారు. ఆనెగుంటకు చెందిన పి.సవిత (22) ఈనెల 23న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని వివరించారు. తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.