పట్టణంలో పోలీసుల నిఘా పెరగడంతో యువత పల్లెల వైపు
పరకాల నేటిధాత్రి
గంజాయి మత్తుకు పల్లె యువత చిత్తు అవుతోంది పట్టణ మరియు మండల సరిహద్దు గ్రామాలతో పాటు గ్రామాల్లోని శివారు ప్రాంతాలు,పడావు పడిన భూముల్లో,పాడుపడ్డ బావు ల సమీపాల్లో,చెరువు గట్టులవద్ద అడ్డాలుగా మార్చుకుని గంజాయి,బోనోఫిక్స్ ఇతర మత్తు పదార్థాలను సేవిస్తున్నారు.వాట్సాప్ లో ప్రత్యేక గ్రూపులు క్రియేట్ చేసుకొని సమాచారాన్ని చేరావేసుకుంటున్నారు.యువకులే లక్ష్యంగా దంద చేస్తున్నారు ముందు ఉచితంగా అలవాటు చేసి ఆక్రమార్కులు గంజాయి ఆశచూపి విద్యార్థులు, యువకులు లక్ష్యంగా వల వేస్తున్నారు.ముందుగా కళాశాలల్లో ఇద్దరు ముగ్గురు యువకులకు ఉచితంగా అలవాటు చేసి,బానిసలుగా మార్చి,మిగితా వారికి వీరితో సరఫరా చేయిస్తున్నట్లు సమాచారం పట్టణాల్లో పోలీ సుల నిఘా అధికంగా ఉండటం వల్ల పచ్చని పల్లెల వైపు పరుగులు తీస్తున్నారు.తల్లితండ్రులు బయటకు చెప్పు కోలేక కుమిలిపోతున్న సంఘటనలు కనపడుతున్నాయి.మత్తులో యువకులు ఓవర్ స్పీడ్ తో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది.చిన్న తనంలోనే కుటుంబానికి శోకన్ని మిగులుస్తున్నారు.