
Karimnagar Hospital.
మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్మన సంపత్ (30) అనే వ్యక్తి మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజేందర్ సోమవారం తెలిపారు.జూలై 11న రాత్రి తాగిన మైకంలో పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు గమనించి చెన్నూరు ఆసుపత్రికి తరలించారు.అనంతరం కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు మృతుడికి భార్య స్వప్న, సోదరుడు రాజేందర్ ఉన్నారని తెలిపారు.